ముగిసిన ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహం నిమజ్జనం

By narsimha lodeFirst Published Sep 23, 2018, 1:59 PM IST
Highlights

ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహం ఆదివారం మధ్యాహ్నం గంగమ్మ ఒడికి చేరుకొంది.ఆరు గంటల్లోనే ఖైరతాబాద్ గణపతి విగ్రహం నిమజ్జనం  జరిగింది.
 


హైదరాబాద్:ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహం ఆదివారం మధ్యాహ్నం గంగమ్మ ఒడికి చేరుకొంది.ఆరు గంటల్లోనే ఖైరతాబాద్ గణపతి విగ్రహం నిమజ్జనం  జరిగింది.

ఖైరతాబాద్  విగ్రహాన్నిత్వరగా పూర్తి చేయాలని హైద్రాబాద్ పోలీసులు నిర్ణయం తీసుకొన్నారు.ఈ మేరకు  ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ఆదివారం నాడు ఉదయం ఆరుగంటలకు ప్రారంభమైంది.

ఉదయం పదిగంటలవరకే  ట్యాంక్ బండ్ ప్రాంతానికి ఖైరతాబాద్  మహాగణపతి విగ్రహాం చేరుకొంది. ట్యాంక్ బండ్ పైకి చేరుకొన్న తర్వాత పూజలు నిర్వహించి  బారీ క్రేన్‌పైకి మహాగణపతి విగ్రహాన్ని ఎక్కించారు.

బారీ క్రేన్ సహాయంతో  హుస్సేన్ సాగర్‌లో మహాగణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తే  ఇతర వినాయక విగ్రహలను నిమజ్జనం చేసేందుకు సులభమయ్యే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.ఈ మేరకు ఖైరతాబాద్  మహాగణపతిని నిమజ్జనం చేసేలా ప్లాన్ చేశారు. ఈ ప్లాన్ మేరకు  పోలీసులు మహాగణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.

సంబంధిత వార్తలు

బాలాపూర్ లడ్డు రికార్డు ధర : రూ. 16.60లక్షలకు దక్కించుకొన్న శ్రీనివాస్ గుప్తా
బాలాపూర్ లడ్డు చరిత్ర ఇదీ: రూ.450తో ప్రారంభమై లక్షల్లోకి

click me!