మరో 286 యాప్స్‌ తొలగించాలి: గూగుల్‌కి సైబర్ పోలీసుల లేఖ

By narsimha lodeFirst Published Jan 28, 2021, 1:50 PM IST
Highlights

లోన్ యాప్ లను తొలగించాలని  సైబర్ క్రైమ్ పోలీసులు  గూగుల్ కు లేఖ రాశారు. 

హైదరాబాద్: లోన్ యాప్ లను తొలగించాలని  సైబర్ క్రైమ్ పోలీసులు  గూగుల్ కు లేఖ రాశారు. 

యాప్ ల ద్వారా లోన్ లిస్తూ  వేధింపులకు  గురి చేయడంతో పలువురు ఆత్మహత్య చేసుకొన్నారు.  మరికొందరు ఈ వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా దేశంలోని పలు చోట్ల సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పలు కాల్ సెంటర్ల నుండి కీలకమైన ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

అంతేకాదు పలువురిని అరెస్ట్ చేశారు. గూగుల్ పే స్టోర్ లో వందలాది లోన్ యాప్స్  ను సైబర్ క్రైమ్ పోలీసులు గర్తించారు. 

సైబర్ క్రైమ్ పోలీసుల లేఖకు గూగుల్ నుండి సమాధానం వచ్చింది. ఇప్పటికే 54 లోన్ యాప్స్ ను తొలగించినట్టుగా చెప్పారు. అయితే ఇంకా 286 లోన్ యాప్స్ ఉన్నాయని వాటి సమాచారాన్ని గూగుల్ కు సైబరాబాద్ పోలీసులు అందించారు. ఈ యాప్స్ ను కూడ తొలగించాలని పోలీసులు గూగుల్ ను కోరారు.

లోన్ యాప్స్ వేధింపుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఆత్మహత్యలు చేసుకొన్నారు. మరికొందరు అవమానాలు భరించలేక పోలీసులను ఆశ్రయించారు. 
 

click me!