ఏపీ కరోనా పేషంట్లకు తెలంగాణలో నో ఎంట్రీ.. ! సరిహద్దుల్లో ఆపేస్తున్న పోలీసులు !!

By AN TeluguFirst Published May 10, 2021, 11:41 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ నుంచి భారీ సంఖ్యలో కరోనా పేషంట్లు హైదరాబాద్ కు వస్తుండడంతో తెలంగాణ పోలీసులు వారిని సరిహద్దుల్లో ఆపేస్తున్నారు. ఏపీ సరిహద్దును దాటి వస్తున్న పేషంట్లను తెలంగాణ పోలీసులు ఆపేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి భారీ సంఖ్యలో కరోనా పేషంట్లు హైదరాబాద్ కు వస్తుండడంతో తెలంగాణ పోలీసులు వారిని సరిహద్దుల్లో ఆపేస్తున్నారు. ఏపీ సరిహద్దును దాటి వస్తున్న పేషంట్లను తెలంగాణ పోలీసులు ఆపేస్తున్నారు.

ఈ మేరకు రామాపురం క్రాస్ రోడ్డు దగ్గర చెక్ పోస్ట్  ఏర్పాటు చేశారు. ఏపీ నుంచి వస్తున్న పేషంట్లను తెలంగాణలోకి అనుమతించడం లేదు. తెలంగాణలోని ఆస్పత్రుల్లో అనుమతులు పొందిన వారికి మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. 

సాధారణ ప్రయాణీకులను మాత్రం తెలంగాణలోకి అనుమతిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకే సోమవారం ఉదయం నుంచి ఈ నిర్భంధాన్ని అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా కర్నూలు ఎస్పీ తెలంగాణ పోలీసులతో మాట్లాడారు. పేషంట్లను అనుమతించాలని కోరుతున్నారు. 

ఇతర ప్రాంతాలనుంచి తెలంగాణలోని హైదరాబాద్ కు చికిత్స కోసం వస్తున్న రోగులతో  ఆసుపత్రుల మీద భారం పడి ఇక్కడి పేషంట్లకు సరైన చికిత్స అందించలేకపోతున్నామని ఇటీవల ప్రధానితో జరిగిన ముఖాముఖిలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉండగా ఆంధ్రనుంచి ఎవ్వరూ తమ రాష్ట్రంలోకి రాకుండా ఒడిశా ప్రభుత్వం శ్రీకాకుళం, ఒడిశా సరిహద్దుల్లో రోడ్డును తవ్వేసింది. కరోనా నేపథ్యంలో ఏపీ సరిహద్దు గ్రామ ప్రజలతో ఒడిశా ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది. వైరస్ పేరుతో సరిహద్దు గ్రామాల ప్రజలకు మాత్రం చుక్కలు చూపిస్తోంది. 

శ్రీకాకుళం-ఒడిశా సరిహద్దు గ్రామాల ప్రజలను తమ రాష్ట్రంలోకి రాకుండా కఠిన చర్యలు తీసుకుంటోంది. ఏపీలో అంత భయంకరమైన వేరియంట్ ఏదీ లేదని అధికారులు చెబుతున్నా ఇతర రాష్ట్రాలు నమ్మడం లేదు. ముఖ్యంగా ఒడిశా ప్రభుత్వం మాత్రం ఏపీపై కఠిన ఆంక్షలను విధిస్తూ వెళ్తోంది. 
 

click me!