కరోనాతో గుడిమల్కాపూర్ కార్పొరేటర్ కూతురు మృతి.. గవర్నర్ పరామర్శ..

By AN TeluguFirst Published May 10, 2021, 11:26 AM IST
Highlights

కరోనా ఎవ్వర్నీ వదలడం లేదు. వచ్చిందంటే తనతో తీసుకుపోతోంది. గుడిమల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్ కూతురు ఆవుల భవాని (29) కరోనాతో మృతి చెందింది. వారం రోజులుగా ఆమె గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఆర్థరాత్రి మృతి చెందారు. 

కరోనా ఎవ్వర్నీ వదలడం లేదు. వచ్చిందంటే తనతో తీసుకుపోతోంది. గుడిమల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్ కూతురు ఆవుల భవాని (29) కరోనాతో మృతి చెందింది. వారం రోజులుగా ఆమె గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఆర్థరాత్రి మృతి చెందారు. 

ఆమెకు భర్త కార్తీక్, 15 రోజల బాబు ఉన్నాడు. కాగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆదివారం దేవర కరుణాకర్ కు పంపిన ఒక సందేశంలో సంతాపం వ్యక్తం చేశారు. 

ఇటువంటి క్లిష్ట సమయంలో నిబ్బరంగా ఉండాలని ఆయన దేవర కరుణాకర్ ను కోరారు. ఆమె అంత్యక్రియలు ఆదివారం ఉదయం బంజారాహిల్స్‌లోని హిందూశ్మశాన వాటికలో జరిగాయి. 

కాగా, దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల వ్యవధిలో 3.66లక్షల మంది కోవిడ్ బారినపడ్డారు. అంతక్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసులు దాదాపు 35 వేలకు పైగా తగ్గడం గమనార్హం. అయితే నిర్ధారణ పరీక్షలు తగ్గడం వల్లే కేసుల సంఖ్య తక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఆదివారం కేవలం 14.7 లక్షల మందికే వైద్య పరీక్షలు చేశారు. అంతక్రితం రోజున 18.6 లక్షల మంది టెస్టులు చేయించుకున్నారు.

ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం ఎనిమిది గంటల వరకూ 14,74,606 మందికి కరోనా పరీక్షలు చేయించుకోగా.. 2,66,161 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2.2 కోట్లకు చేరింది.

ఇదే సమయంలో 3,754 మంది కరోనాతో వృద్ధుడికి చేరుకున్నారు. దీంతో వైరస్ ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకు 2, 46,116 మందిని కోవిడ్ బలితీసుకుంది. మరణాల రేటు 1.09 శాతంగా ఉంది.

click me!