తెలంగాణ ఎస్ఐ, ఎఎస్ఐ రాత పరీక్ష: ఫైనల్ కీ విడుదల

Published : May 11, 2023, 10:58 AM ISTUpdated : May 11, 2023, 11:19 AM IST
తెలంగాణ ఎస్ఐ, ఎఎస్ఐ  రాత పరీక్ష: ఫైనల్ కీ విడుదల

సారాంశం

తెలంగాణ  ఎస్ఐ, ఎఎస్ఐ ఫైనల్ కీ  విడుదలైంది.   ఫైనల్ కీ వెబ్ సైట్ లో అందుబాటులో  ఉంచినట్టుగా  అధికారులు ప్రకటించారు. 

హైదరాబాద్:  తెలంగాణ  ఎస్ఐ, ఎఎస్ఐ  రాత పరీక్ష  తుది 'కీ' విడుదలైంది.  తుది కీ  పై  అభ్యంతరాలుంటే  ఫిర్యాదు చేయాలని  పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు  ప్రకటించింది.ఈ ఏడాది  ఏప్రిల్ 08,09 తేదీల్లో   ఎస్ఐ, ఎఎస్ఐ  రాతపరీక్షలు  నిర్వహించారు. మొత్తం 59,534 మంది అభ్యర్ధులు  ఈ పరీక్షలు రాశారు.  ఎస్ఐ,  ఎఎస్ఐ(పింగర్ ప్రింట్స్)  విభాగాల్లో  పరీక్షలు నిర్వహించింది తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు.

రాష్ట్రంలోని మూడు   జిల్లాల్లో  పరీక్షలు నిర్వహించారు. హైద్రాబాద్, కరీంనగర్, వరంగల్  జిల్లాలోని 81 కేంద్రాల్లో  పరీక్షలు  నిర్వహించారుఈ పరీక్షలకు సంబంధించిన   కీ ని  రాష్ట్ర  పోలీస్ నియామక బోర్డు   ఇవాళ విడుదల చేసింది.  ఈ కీపై  అభ్యంతరాలుంటే   చెప్పాలని  తెలంగాణ పోలీస్ నియామకబోర్డు తెలిపింది. ఈ నెల  14వ తేదీ లోపుగా  అభ్యంతరాలు తెలపాలని  పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ప్రకటించింది. ఇంగ్లీష్,  ,గణితం , జనరల్ స్టడీస్ , తెలుగు ప్రశ్నాపత్రాలకు అభ్యర్ధులు  పరీక్షలు రాశారు.

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?