క్యూ ఆర్ కోడ్ తో షీ టీమ్స్ కు పిర్యాదు చేయొచ్చు

By narsimha lodeFirst Published Mar 15, 2021, 7:12 PM IST
Highlights

తెలంగాణ రాష్ట ప్రభుత్వం మహిళా భద్రతపై చేపట్టిన చర్యల్లో భాగంగా క్యూ ఆర్ కోడ్ తో షీ-టీమ్ కు  ఫిర్యాదుచేసే విధానంపై నగర వాసుల్లో చైతన్యం కల్పించేందుకు గాను మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో నేడు పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. 


హైదరాబాద్, మర్చి 15:   తెలంగాణ రాష్ట ప్రభుత్వం మహిళా భద్రతపై చేపట్టిన చర్యల్లో భాగంగా క్యూ ఆర్ కోడ్ తో షీ-టీమ్ కు  ఫిర్యాదుచేసే విధానంపై నగర వాసుల్లో చైతన్యం కల్పించేందుకు గాను మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో నేడు పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. 

ఇవాళ హైదరాబాద్ లోని లక్డికాపూల్ మెట్రో రైల్ స్టేషన్లలో క్యూ - ఆర్ కోడ్ తో ఫిర్యాదు చేసే పోస్టర్లను మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీ.జీ. స్వాతి లక్రా, డీ.ఐ.జీ. సుమతి లు ఆవిష్కరించారు.  మెట్రో రైల్ మహిళా ప్రయాణికులు, మెట్రో రైల్  సిబ్బంది ద్వారా క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసి పిర్యాదు చేసే విధానం పై అవగాహన కల్పించారు. 

ఈ సందర్బంగా అడిషనల్ డీ.జీ. స్వాతి లక్రా మాట్లాడుతూ  రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుండి ఐనా కేవలం క్యూ ఆర్ కోడ్ సహాయంతో తమపైన గాని తమ చుట్టూ ప్రక్కల గాని బహిరంగ ప్రదేశాలలో వారు పనిచేసే ప్రాంతాల్లో మహిళలకు వ్యతిరేకంగా  ఈవ్ టీసింగ్, మొబైల్ ఫోన్ ద్వారా, ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు.

 డీ.ఐ.జీ  సుమతిమాట్లాడుతూ మహిళలు, బాలికలు ఇకపై షీ-టీమ్ లకు పలు నేరాలపై ఫిర్యాదు చేసేందుకు తమ పరిధిలోని వాట్సప్ నెంబర్లను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకుండా ఈ క్యూఆర్ కోడ్ తో రాష్ట్రంలో ఎక్కడి నుండి అయినా ఫిర్యాదు చేసే వెసులుబాటు ఉంటుందన్నారు.

తమ మొబైల్ ఫోన్ లో ఈ లింక్ ను సేవ్ చేసుకోవాలని కోరారు. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి, ఈ లింక్ ఓపెన్ చేసి దాని ద్వారా ఫిర్యాదుల పేజ్ ఓపెన్ అవుతుందన్నారు.

దానిలో ఫిర్యాదు వివరాలు నమోదు చేస్తే ఆ ఫీర్యాదు షీ-టీమ్ సెంట్రల్ సర్వర్ కు వెళ్తుందన్నారు. దీనితో ఈ ఫిర్యాదుపై సంబంధిత పరిధిలోని అధికారులు వెంటనే స్పందిస్తారని తెలిపారు. 

క్యూ ఆర్ కోడ్ ద్వారా అందే ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు, సమస్యల పరిష్కారానికి పట్టిన సమయం అధికారుల ప్రవర్తన అంశాలు తదితర విషయాలు కూడా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకుని సమీక్షించే అవకాశం ఉంటుందని అన్నారు.  

తమ స్పందనను కూడా పౌరులు ఈ క్యూఆర్ కోడ్ (ఆకుపచ్చ) ద్వారా తెలుపవచ్చని స్పష్టం చేశారు. క్యూ-ఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదు చేసే విధానంపై చైతన్యం చేసేందుకు గాను ఈ పోస్టర్లను రాష్ట్రం లోని అన్ని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ప్రధాన కూడళ్లు, కళాశాలలు, కార్యాలయాల్లో ప్రదర్శించనున్నట్టు అడిషనల్ డీజీ తెలిపారు.

click me!