గ్యాంగ్‌స్టర్ నయీం అనుచరుడు శేషన్నకు ఆయుధాలెక్కడివి?: కాల్ డేటాపై పోలీసుల ఆరా

By narsimha lode  |  First Published Sep 27, 2022, 2:31 PM IST

గ్యాంగ్ స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శేషన్నను పోలీసులు విచారిస్తున్నారు.. శేషన్న ఉపయోగించిన ఫోన్ డేటాపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 



హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శేషన్నఉపయోగించిన మొబైల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. శేషన్నకు ఆయుధాలు ఎక్కడి నుండి వస్తున్నాయనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటరైన తర్వాత శేషన్న పోలీసులకు చిక్కకుండా పారిపోయాడు. కొత్తపేటలో సెటిల్ మెంట్  చేస్తున్న సమయంలో శేషన్నను సోమవారం నాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్, కౌంటర్ ఇంటలిజెన్స్, పోలీసులు శేషన్నను ప్రశ్నిస్తున్నారు. శేషన్న ఉపయోగించిన ఫోన్ కాల్ డేటాపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరెవరితో శేషన్న కాంటాక్టులో ఉన్నాడనే విసయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హైద్రాబాద్ నగరంలోని హుమాయున్ నగర్ లో అక్బర్ అనే వ్యక్తికి శేషన్న వెపన్ విక్రయించాడు. అక్బర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే శేషన్న నుండి వెపన్ కొనుగోలు చేసినట్టుగా అతను సమాచారం ఇచ్చాడు. దీంతో శేషన్న కదలికలపై పోలీసులు నిఘాను ఏర్పాటు చేశారు.  శేషన్న వద్ద నాలుగు ఆయుధాలున్నట్టుగా పోలీసులు గుర్తించారు. శేషన్నకు ఆయుధాలు ఎక్కడి నుండి వచ్చాయనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆరేళ్ల కాలంలో శేషన్న ఎంతమందికి ఆయుధాలు విక్రయించారనే విషయమై కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ టీవీ 9 కథనం ప్రసారం చేసింది. 

Latest Videos

undefined

మావోయిస్టు పార్టీలో పనిచేసిన శేషన్న జనజీవన స్రవంతిలో కలిశాడు. ఆ తర్వాత ఆయన నయీం గ్యాంగ్ లో చేరాడు. నయీం గ్యాంగ్ లో శేషన్న కీలకంగా మారాడు. సెటిల్ మెంట్లు, దందాలు శేషన్న ద్వారానే నయీం చేసేవాడని పోలీసులు అనుమానిస్తున్నారు. 

also read:హైద్రాబాద్ లో సెటిల్ మెంట్లు: పోలీసుల అదుపులోకి నయీం ప్రధాన అనుచరుడు శేషన్న

2016 ఆగస్టు 16వ తేదీన షాద్ నగర్ లో నయీం ఎన్ కౌంటర్ జరిగింది. ఉదయం 8 గంటల సమయంలో జరిగిన కాల్పుల్లో నయీం మృతి చెందాడు. ఓ సెటిల్ మెంట్ కోసం షాద్ నగర్ కు వచ్చిన విషయం తెలుసుకున్న పోలీసులు నయీంను ఎన్ కౌంటర్ లో హతమార్చారు. నయీం ఎన్ కౌంటర్ జరిగిన రోజు నుండి శేషన్న తప్పించుకు తిరుగుతున్నాడుు. కర్నూల్ జిల్లాలోని  మాజీ నక్సలైట్ ఇంట్లో శేషన్న తలదాచుకున్న విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు. అయితే అప్పటికే శేషన్న ఆ ఇంటి నుండి వెళ్లిపోయారు.  కానీ ఇప్పటివరకు శేషన్న ఆచూకీ దొరకలేదు. అయితే రహస్యంగా ఉంటూ శేసన్న ఆయుధాలు విక్రయిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

click me!