కర్ణంగూడ కాల్పుల కేసు: రెండు స్కార్పియోల గుర్తింపు, బుల్లెట్ల సీజ్

Published : Mar 02, 2022, 11:53 AM IST
కర్ణంగూడ కాల్పుల కేసు: రెండు స్కార్పియోల గుర్తింపు, బుల్లెట్ల సీజ్

సారాంశం

కర్ణంగూడ కాల్పుల ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసులో పోలీసులకు క్లూ కూడా లభ్యం కాలేదు.మరో వైపు రెండు అనుమానాస్పద స్కార్పియోలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

హైదరాబాద్: Karnamguda  కాల్పుల ఘటన కేసులో  రెండు  అనుమానాస్పద Scorpioలను పోలీసులు గుర్తించారు. ఈ వాహనాల్లో రెండు లైవ్ Bulletsను బుధవారం నాడు police స్వాధీనం చేసుకొన్నారు. కర్ణంగూడ పెట్రోల్ బంక్ వద్ద ఉన్న CCTV  పుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. 

కర్ణంగూడ వద్ద మంగళవారం నాడు దుండగులు జరిపిన కాల్పుల్లో Srinivas Reddy, రాఘవేందర్ రెడ్డిలు మరణించారు. శ్రీనివాస్ రెడ్డి, Raghavender Reddy లు ఉపయోగించిన mobile  కాల్‌డేటా ఆధారంగా పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. Matta Reddyకి శ్రీనివాస్ రెడ్డికి మధ్య భూ వివాదాలున్నాయని సమాచారం. దీంతో మట్టారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అయితే శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలను హత్య చేసే  వివాదం తమ మధ్య లేదని మట్టారెడ్డి పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తోంది. పోలీసుల విచారణలో  మట్టారెడ్డి నోరు మెదపడం లేదని సమాచారం.

వివాదాల్లో ఉన్న భూములను కొనుగోలు చేసి విక్రయించడమే శ్రీనివాస్ రెడ్డి చేసేవాడు. చాలా కాలం నుండి శ్రీనివాస్ రెడ్డి  ఈ తరహలోనే రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. దీంతోనే శ్రీనివాస్ రెడ్డి తన ఇంటి వద్దతో పాటు  బయటకు ఎక్కడికి వెళ్లినా కూడా అనుచరులతో వెళ్లేవాడు. తరచూ ఆయన వాహనాలను మార్చేవాడు. బయటకు వెళ్లే సమయంలో శ్రీనివాస్ రెడ్డి మూడు వాహనాల్లో వెళ్లేవాడని ఆయన అనుచరులు చెబుతున్నారు.

శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలపై ముగ్గురు దుండగులు హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మంగళవారం నాడు బుల్లెట్లు స్వాధీనం చేసుకొన్న ప్రాంతంలోనే దుండగులు ఉండి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మరో వైపు పెట్రోల్ బంక్ వద్ద ఉన్న సీసీటీవీ పుటేజీలో మాత్రం  కార్లు వంటి వాహనాలు  ఫైరింగ్ జరిగిన ప్రాంతం వైపునకు వెళ్లలేదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే కాల్పులు జరిగిన ప్రాంతానికి దుండగులు బైక్ పై వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే రెండు అనుమాన్సాస్పద స్కార్పియోల్లో బుల్లెట్లు దొరకడం కలకలం రేపుతుంది.  ఈ బుల్లెట్లను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు.అయితే ఈ వాహనాలు ఎవరివనే కోణంలో  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి ఈ స్థలం నుండి తిరిగి వెళ్లే సమయంలో దుండగులు కాల్పులకు దిగారు. అయితే ఈ సమయంలో కారు నడుపుతున్న రాఘవేందర్ రెడ్డికి గాయాలయ్యాయి. అయితే అదే సమయంలో శ్రీనివాస్ రెడ్డి కారు దిగి పారిపోయే ప్రయత్నం చేశాడు. 

అయితే శ్రీనిాస్ రెడ్డికి గతంలో జరిగిన ప్రమాదంలో కాలు విరిగింది. దీంతో ఆయన ఎక్కువ దూరం పరుగెత్తలేకపోయాడు. సమీపంలోని పొదల్లోనే శ్రీనివాస్ రెడ్డిని దుండగులు పట్టుకొన్నారు. శ్రీనివాస్ రెడ్డిపై షాట్ వెపన్ తో దుండగులు కాల్పి చంపారు. మరో వైపు కారులో ఉన్న రాఘవేందర్ రెడ్డి కారును రోడ్డు వరకు తీసుకెళ్లాడు. 

కానీ అక్కడి నుండి ఆయన కారును నడపలేకపోయాడు. వెంటనే కృష్ణ, హఫీజ్ లకు రాఘవేందర్ రెడ్డి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. ఈ సమాచారం ఆధారంగా కృష్ణ, హఫీజ్ లు సంఘటన స్థలానికి చేరుకొన్నారు.   అదే సమయంలో ఆ ప్రాంతంలో మట్టారెడ్డి కూడా ఉన్నారు. ఈ విషయమై హఫీజ్, కృష్ణలు మట్టారెడ్డిని నిలదీశారు.

 మట్టారెడ్డికి శ్రీనివాస్ రెడ్డికి మధ్య విబేధాలున్నాయి. ఈ విషయమై మట్టారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. సంఘటన స్థలానికి వచ్చిన కృష్ణ, హఫీజ్ లను కూడా పొలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే
Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి