
విజయవాడ కనకదుర్గమ్మకు తెలంగాణ నుంచి వచ్చిన భక్తులు ఆదివారం ఘనంగా బోనాలు సమర్పించనున్నారు. హైదరాబాద్ లోని పాతబస్తీ ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో కనక దుర్గమ్మకు బోనాలు, పట్టువస్త్రాలు సమర్పించేందుకు భక్తులు విజయవాడ చేరుకున్నారు.
శనివారం మధ్యాహ్నమే చక్కగా అలంకరించిన బోనాలు ఉంచిన మట్టిపాత్రలను నెత్తిమీద పెట్టుకుని మహిళలు భక్తి ప్రపత్తులతో పాతబస్తీ నుంచి విజయవాడలోని ఇంద్రకీలాద్రి పైన ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధికి బయలుదేరారు.
రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు సుఖ శాంతులతో ఉండాలంటూ అమ్మవారిని వేడుకోనున్నారు భక్తులు.