
రోహిత్ ఆత్మహత్య ఘటన మరచిపోకముందే మరో ఆత్మహత్య హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో చోటు చేసుకుంది. హెచ్.సి.యు.లో పిహెచ్ డి చదువుతున్న విశాల్ ఆత్మహత్యకు పాల్పడడంతో యూనివర్శిటీ విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు.
ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ. ఆ యూనివర్శిటీలో మరో యువ కిశోరం బలయ్యాడు. ఆ యూనివర్శిటీలో పిహెచ్ డి చదువుతున్న విశాల్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
యూనివర్శిటీ పక్కనే ఉన్న అపర్ణ సరోవర్ భవనంలో నివాసం ఉంటున్నాడు విశాల్. ఆ బిల్డింగ్ లోని 14వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడినాడు విశాల్.
విశాల్ మరణవార్త విని యూనివర్శిటీ శోకసంద్రంలో మునిగిపోయింది. విశాల్ ఆత్మహత్యపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.