ముగిసిన పిసీసీ సమావేశం : ఎఐసిసి ఇంచార్జి కార్యదర్శులను ప్రకటించిన ఉత్తమ్

First Published Jun 25, 2018, 5:11 PM IST
Highlights

సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు...

ఇవాళ గాంధీభవన్ లో జరిగిన పిసిసి సమావేశంలో అద్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పార్లమెంట్ స్థానాల వారిగా ఎఐసిసి ఇంచార్జి కార్యదర్శులను ఆయన ప్రకటించారు. 
బోసురాజును  హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి,  మెదక్, చేవెళ్ల లలకు
సలీం అహ్మద్ కి మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, భువనగిరి, మహబూబాబాద్, ఖమ్మం లకు 
శ్రీనివాసన్ ను ఆదిలాబాద్, పెద్దపల్లి, జహీరాబాద్, కరీంనగర్,నిజామాబాద్, వరంగల్ పార్లమెంట్ స్థానాలకు ఇంచార్జి కార్యకదర్శులుగా పనిచేస్తారని తెలిపారు.  వీరే ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు కూడా కార్యదర్శులుగా ఉంటారని ఉత్తమ్ తెలిపారు. వీరు దాదాపు 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా పార్టీ బాద్యతలు వహిస్తారని ఉత్తమ్ వివరించారు. 

ఈ కార్యదర్శులు వారి పరిదిలోని నాయకులను సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని ఉత్తమ్ చెప్పారు. ముందస్తు ఎన్నికలకు సిద్దం చేయడానికే ఈ నియామకం జరిగినట్లు, వారు బూత్ స్థాయి కమిటీల ఏర్పాటు కోసం తెలిపారు. ఇక శక్తి యాప్ ను ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు డౌన్ లోడ్ చేసుకునేలా చూడాలని ఉత్తమ్ తెలిపారు.

మరోసారి కేసీఆర్ విసిరిన సవాల్ పై ఉత్తమ్ స్పందించారు. ఏ విషయంలోనే ప్రతిపక్ష పార్టీలను సంప్రదించని సీఎం తాజాగా ముందస్తు ఎన్నికల గురించి తమతో సంప్రదిస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ఎప్పుడూ సిద్దమేనని అది 2018 డిసెంబర్ అయినా, 2019 మే అయినా అని స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలు వస్తే తెలంగాణలో కుటుంబ పాలన కొద్ద రోజుల ముందే అంతమవుతుందని అన్నారు.

దానం నాగేందర్ టీఆర్ఎస్ లో చేరడం చాలా బాధాకరమని ఉత్తమ్ అన్నారు. అందులోనూ దానం టీఆర్ఎస్ స్క్రిప్ట్ ను చదువుతూ రాజకీయ జీవితాన్నిచ్చిన కాంగ్రెస్ ను విమర్శించడం మరింత విడ్డూరంగా ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కువకాలం పార్టీ అద్యక్షులుగా ఉంది బలహీనవర్గాల నేతలే అని ఉత్తమ్ గుర్తు చేశారు. 

గాంధీభవన్ లో జరిగిన సమావేశానికి ఎఐసిసి ఇంచార్జి ప్రధాన కార్యదర్శి కుంతియా, కార్యదర్శులు బోసురాజు, సలీం అహ్మద్, శ్రీనివాస కృష్ణన్ లు, పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పాటు సీనియర్ నాయకులు సంపత్ కుమార్, డీకే అరుణ, చిన్నా రెడ్డి, సబిత ఇంద్రారెడ్డి, హన్మంతరావులు తదితరులు హాజరయ్యారు.
 

click me!