
హైదరాబాద్: పోస్టింగ్‌ల విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న కొందరు ఐఎఎస్ అదికారులు సోమవారం నాడు రహస్య ప్రాంతంలో సమావేశమయ్యారు. సీనియర్లను కాదని జూనియర్లకు ప్రాధాన్యత కల్పిస్తున్నారని, ఒక సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఐఎఎస్‌లు మండిపడుతున్నారు.అవసరమైతే ఈ విషయమై సీఎం కేసీఆర్‌ను, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి వినతి పత్రం సమర్పించాలని భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పోస్టింగ్‌ల విషయంలో కొందరు ఐఎఎస్‌లు అసంతృప్తితో ఉన్నారు. సుమారు 9 మంది ఐఎఎస్ అధికారులు సోమవారం నాడు రహస్య ప్రదేశంలో సమావేశమయ్యారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఐఎఎస్‌లు రహస్య ప్రాంతంలో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని ఇదే సామాజిక వర్గానికి చెందిన ఐఎఎస్‌లతో వీరంతా సంప్రదింపులు జరుపుతున్నారు.
సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లకు కీలకమైన పోస్టింగ్‌లు కట్టబెడుతున్నారని ఐఎఎస్‌లు అభిప్రాయపడుతున్నారు. ఒక సామాజిక వర్గానికే చెందిన వారికి పోస్టింగుల్లో ప్రాధాన్యత ఇస్తున్నారని బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఐఎఎస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
రానున్న రోజుల్లో కూడ ఇదే రకమైన పరిస్థితులు ఉత్పన్నం కాకూడదనే ఉద్దేశ్యంతో ఒక ఫోరంగా ఏర్పడి తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు. ఇదే విషయమై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేయాలని ఐఎఎస్‌లు భావిస్తున్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు.