Jobs : తెలంగాణ యువతకు బంపరాఫర్... ఈ కోర్సు చేస్తే చాలు విదేశాల్లో జాబ్ పక్కా

Published : Jul 20, 2026, 10:27 PM IST
jobs

సారాంశం

నేటితరం యువత విదేశీ చదువులు, ఉద్యోగాలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర యువతకు విదేశాల్లో ఉద్యోగాలు కల్పించే ప్రత్యేక ఏర్పాటు చేసింది.

Foreign Jobs : తెలంగాణకు చెందిన అర్హులైన, అనుభవజ్ఞులైన నర్సులకు అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. విదేశాల్లో భారతీయ హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్‌కు ఉన్న భారీ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. తెలంగాణ ఓవర్సీస్ మాన్‌పవర్ కంపెనీ (TOMCOM), గ్లోబల్ నర్స్ ఫోర్స్ (Global Nurse Force) సంస్థల మధ్య యువతకు విదేశీ ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా సోమవారం ఒక ముఖ్యమైన అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీస్, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.

ప్రపంచవ్యాప్తంగా పెరిగిన నర్సింగ్ డిమాండ్ : మంత్రి

ఒప్పందం అనంతరం మంత్రి వెంకటస్వామి మాట్లాడారు. "యూరప్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నైపుణ్యమున్న భారతీయ నర్సులకు రోజురోజుకూ ఆదరణ, డిమాండ్ పెరుగుతున్నాయి. మన రాష్ట్ర నర్సింగ్ గ్రాడ్యుయేట్లు, అనుభవజ్ఞులైన నర్సులకు ఆయా దేశాల్లో నాణ్యమైన ఉద్యోగావకాశాలు దక్కేలా ప్రభుత్వం టామ్‌కామ్ ద్వారా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తోంది." అన్నారు.

అభ్యర్థులకు అత్యున్నత ప్రమాణాలతో శిక్షణ అందించి, అంతర్జాతీయ రంగానికి తగ్గట్టుగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. శిక్షణ నియామకాల నాణ్యతను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. విదేశీ ఉపాధి కార్యక్రమాలు తెలంగాణ యువతకు మాత్రమే కాకుండా ఆతిథ్య దేశాల ఆరోగ్య రంగ అవసరాలకు కూడా తోడ్పడే విధంగా ఉండాలని మంత్రి అన్నారు.

నర్సులకు అందించే ఉచిత శిక్షణ, సేవలు ఇవే..

టామ్‌కామ్ – గ్లోబల్ నర్స్ ఫోర్స్ భాగస్వామ్యం ద్వారా విదేశీ ఉద్యోగాలకు ఎంపికైన నర్సులకు క్రింది విభాగాల్లో సమగ్ర సహకారం అందించనున్నారు.

విదేశీ భాషా శిక్షణ : జర్మన్ తో పాటు ఆయా దేశాల భాషలపై ప్రత్యేక శిక్షణ.

కమ్యూనికేషన్ స్కిల్స్ : అంతర్జాతీయ ఆసుపత్రుల ప్రమాణాలకు తగిన క్లినికల్ కమ్యూనికేషన్ శిక్షణ.

ఇంటర్వ్యూ గైడెన్స్ : విదేశీ ప్రతినిధుల ఇంటర్వ్యూలను సులువుగా ఎదుర్కొనే నైపుణ్యాలు.

అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ : లైసెన్సింగ్, వీసా ప్రక్రియలు, ప్రయాణ ఏర్పాట్లు, నేరుగా ఉద్యోగ ప్లేస్‌మెంట్స్ (Placements).

ప్రధానంగా ఏ ఏ దేశాల్లో అవకాశాలు?

ఈ ఒప్పందం ద్వారా ప్రధానంగా క్రింది దేశాలలో విదేశీ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

  • జర్మనీ
  • జపాన్
  • ఇజ్రాయెల్
  • యూరప్‌లోని ఇతర ప్రముఖ దేశాలు

ఇప్పటికే అనుభవం ఉన్న నర్సులతో పాటు, కొత్తగా నర్సింగ్ పూర్తి చేసిన యువత కూడా విదేశీ అవకాశాలపై ఆసక్తి చూపడం సానుకూల పరిణామమని మంత్రి వెంకటస్వామి అన్నారు. తెలంగాణ నైపుణ్యాన్ని గ్లోబల్ ఆపర్చునిటీస్‌తో జోడించే విశ్వసనీయ సంస్థగా TOMCOM నిలుస్తోందని మంత్రి పేర్కొన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

😂🤣 KTR Shares Funny Incident : మెడపై కత్తిపెట్టి నాది పులివెందుల అన్నాడు | Asianet News Telugu
Ration Card: స‌మ‌యం లేదు మిత్ర‌మా.. ఇలా చేయ‌క‌పోతే రేష‌న్ కార్డు ర‌ద్దడం ఖాయం, ఇంకో 10 రోజులే