ఫలక్ నుమా ప్రమాదానికి బెదిరింపు లేఖకు సంబంధం లేదు: రైల్వే శాఖ

By narsimha lode  |  First Published Jul 7, 2023, 2:04 PM IST

వారం రోజుల క్రితం  వచ్చిన  బెదిరింపు లేఖకు  ఇవాళ  ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలు  ప్రమాదానికి సంబంధం లేదని  రైల్వే శాఖ స్పష్టం చేసింది. 


హైదరాబాద్: వారం రోజుల క్రితం  వచ్చిన బెదిరింపు లేఖకు  ఇవాళ  ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలులో ప్రమాదానికి సంబందం లేదని రైల్వే శాఖ సీపీఆర్ఓ రాకేష్ స్పష్టం చేశారు. ఫలక్ నుమా రైల్వే ప్రమాదంపై  విచారణ తర్వాతే  కారణాలు చెప్పగలమని  రైల్వే శాఖ సీపీఆర్ఓ చెప్పారు.  ఈ బెదిరింపు లేఖపై  పోలీసులు విచారణ చేస్తున్నారని  సీపీఆర్ఓ గుర్తు  చేశారు.  పోలీసుల విచారణ ఇంకా పూర్తి కావాల్సి ఉందని  సీపీఆర్ఓ తెలిపారు. రైల్వే ప్రమాదానికి గల  కారణాలపై విచారణలో పూర్తి వివరాలు తేలుతాయన్నారు.

బాలాసోర్ తరహా ప్రమాదం జరుగుతుందని  ఇటీవలనే   దక్షిణ మద్య రైల్వే శాఖకు  బెదిరింపు లేఖ అందింది.  ఈ ఏడాది జూన్  30న  రైల్వే శాఖకు ఈ లేఖ అందింది. ఈ లేఖ విషయమై నార్త్ జోన్  పోలీసులకు దక్షిణ మధ్య రైల్వే శాఖాధికారులు  ఫిర్యాదు  చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా  నార్త్ జోన్ పోలీసులు దర్యాప్తు  నిర్వహిస్తున్నారు.  ఢిల్లీ- హైద్రాబాద్ మార్గంలో ఈ ప్రమాదం జరుగుతుందని ఆ లేఖలో  వార్నింగ్ ఇచ్చారు. ఈ లేఖ గురించి విచారణ చేస్తున్నామని నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి మూడు రోజుల క్రితం మీడియాకు  తెలిపారు. 

Latest Videos

undefined

also read:ఫలక్‌నుమా రైలులో మంటలు, నాలుగు బోగీలు దగ్ధం: భువనగిరి సమీపంలో నిలిపివేత (వీడియో)

అయితే ఇవాళ ఫలక్ నుమా  రైలులో ప్రమాదం జరగడంతో  ఈ లేఖ అంశం చర్చకు వచ్చింది.  ఈ దిశగా  ఏమైనా  కారణాలున్నాయా  అనే చర్చ కూడ సాగుతుంది.  అయితే ఈ లేఖతో  ఫలక్ నుమా ప్రమాదానికి  సంబంధం లేదని  రైల్వే సీపీఆర్ ఓ చెప్పారు.


 

click me!