తెలంగాణ నిరుద్యోగుల కొంప ముంచిన కొత్త జిల్లాలు

Published : Jul 26, 2017, 11:03 AM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
తెలంగాణ నిరుద్యోగుల కొంప ముంచిన కొత్త జిల్లాలు

సారాంశం

కొంప ముంచిన కొత్త జిల్లాల ఏర్పాటు ఉద్యోగాలొస్తాయని ఆశిస్తే ఉల్టా అయింది జాబ్స్ రిక్రూట్ మెంట్ మరింత  ఆలస్యం లబోదిబోమంటున్న టీచర్ అభ్యర్థులు సుప్రీంకోర్టుకు కొత్త జిల్లాలను సాకుగా చూపిన సర్కారు

కొత్త జిల్లాలు వస్తే అద్భుతాలు జరుగుతాయని అన్నారు. గొప్ప మేలు జరుగుతుందని ఊదరగొట్టిర్రు. ఉద్యోగాల లభ్యత పెరిగి మంచిరోజులే వస్తాయన్నారు. కానీ తెలంగాణ నిరుద్యోగులకు కొత్త జిల్లాల ఏర్పాటు శాపంగా మారింది. వాళ్ల కొంప ముంచాయి కొత్త జిల్లాలు. ఇది ఎవరో చెప్పిన మాట కాదు. తెలంగాణ సర్కారు చెప్పిన మాటే. అదెలాగంటారా? ఈ స్టోరీ చదవండి.

తెలంగాణ ప్రభుత్వం పాలనా సౌలభ్యం పేరుతో 10 జిల్లాల తెలంగాణను 31 జిల్లాలకు పెంచింది. గత ఏడాది దసరా నాడు కొత్త జిల్లాలకు ఊపిరి పోసింది సర్కారు. దీంతో కొత్త జిల్లాలు వచ్చాయి కాబట్టి ఉద్యోగుల అవసరాలు పెరుగుతాయని, తద్వారా ఒకటికి రెండు ఉద్యోగాలు పెరిగి తమ పంట పండుతుందని నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. కొత్త రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయన్నట్లుగానే కొత్త జిల్లాలతో కూడా కొలువుల జారత సాగుతుందని సంబరపడ్డారు. కానీ ఆచరణలో ఉల్టా జరిగింది.

తెలంగాణ, ఎపి ప్రభుత్వాలు మూడు నెలల్లోగా టీచర్ పోస్టులు భర్తీ చేయాలని సుప్రీంకోర్టు మార్చి నెలలోనే ఆదేశాలిచ్చింది. కానీ మూడు నెలలు దాటిపోయినా సుప్రంకోర్టు ఆదేశాలు అమలు కాలేదు. దీంతో నిరుద్యోగులు మళ్లీ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. సుప్రీంకోర్టు మరోసారి సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకు టీచర్ పోస్టులను భర్తీ చేయలేదంటూ నిలదీసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వ తరుపు లాయర్ చెప్పిన మాట ఏమంటే తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగానే టీచర్ పోస్టుల భర్తీ ఆలస్యమైందని కోర్టుకు తెలిపారు.

మూడేళ్లుగా తెలంగాణ సర్కారు ఒక్కటంటే ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు. అంతకుముందు తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో టీచర్ పోస్టుల భర్తీ జరగలేదు. దీంతో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ లేక ఇటు లక్షలాది మంది టీచర్ అభ్యర్థులు నష్టపోతున్నరు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలు ఉపాధ్యాయుల కొరతతో అల్లాడిపోతున్నాయి. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలకు కాకుండా వేలాది ఫీజులు చెల్లించి తమ పిల్లలను ప్రయివేటుకు పంపాల్సిన దుస్థితి తల్లిదండ్రులకు కలిగింది.

టీచర్ ఉద్యోగాలే కాకుండా మిగతా ఉద్యోగాలు కూడా కొత్త జిల్లాల పేరుతో డిలే అవుతున్నాయని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గత పదేళ్ల కాలంలో రాష్ట్రం కోసం పోరాటం, తర్వాత రాష్ట్రం వచ్చీ రాగానే కొత్త జిల్లాల పేరుతో హడావిడి. ఏమన్నా అంటే కొత్త జిల్లాలు కాగానే జాబ్స్ అన్నారు. కానీ కొత్త జిల్లాలు ఏర్పడి పది నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు అన్ని రకాల ఉద్యోగాల విషయంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండిపోయిందని నిరుద్యోగులు చెబుతున్నారు.

మొత్తానికి కొత్త రాష్ట్రం, కొత్త జిల్లాలు ఇవేవీ కొత్త ఉద్యోగాలు ఇచ్చేందుకు కాదని, కేవలం మాటలకే పరిమితమైపోయాయని నిరుద్యోగులు నిట్టూరుస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu