తెలంగాణ మునిసిపల్ ఎన్నికలు 2020: మూడు ముక్కలాటా... లేక ఏకపక్షమేనా...?

By Sandra Ashok KumarFirst Published Jan 11, 2020, 1:23 PM IST
Highlights

ఈ పురపాలక ఎన్నికల్లో తమకు ఎదురులేదని అధికార టీఆర్‌ఎస్‌ బయటకు అంటున్నప్పటికీ,  అన్ని స్థానాల్లోనూ, తెరాస సునాయాస విజయం మాత్రం సాధ్యం కాకపోవచ్చు. ఈ ఎన్నికల్లో కనీసం కొన్ని మునిసిపాలిటీల్లోనయినా నువ్వా నేనా అన్నట్టుగా పోరు ఉండబోతుందనేది అక్షర సత్యం. 

తెలంగాణాలో మునిసిపల్ ఎన్నికల వేడి రాజుకుంది. అన్ని పార్టీలు కూడా బయటకు బీరాలు పలుకుతున్నప్పటికీ...లోలోన ప్రతి ఒక్కరు కొన్ని సమస్యలతోనే బాధపడుతున్నారు. అధికారపక్షానికేమో అభ్యర్థులు ఎక్కువయి తంటాలు కలుగుతుంటే, మరోపక్క విపక్షాలకు అన్ని చోట్లా పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకని స్థితి. ఈ నేపథ్యంలో అసలు వాస్తవిక పరిస్థితులేంటో, ఏ పార్టీ ఎక్కడెక్కడ బలంగా ఉందొ చూద్దాం. 

ఈ పురపాలక ఎన్నికల్లో తమకు ఎదురులేదని అధికార టీఆర్‌ఎస్‌ బయటకు అంటున్నప్పటికీ,  అన్ని స్థానాల్లోనూ, తెరాస సునాయాస విజయం మాత్రం సాధ్యం కాకపోవచ్చు. ఈ ఎన్నికల్లో కనీసం కొన్ని మునిసిపాలిటీల్లోనయినా నువ్వా నేనా అన్నట్టుగా పోరు ఉండబోతుందనేది అక్షర సత్యం. 

also read మున్సిపల్ ఎన్నికలు: నామినేషన్ వేసిన ప్రణయ్ హత్య కేసు నిందితుడు

ముఖ్యంగా కాంగ్రెస్‌, బీజేపీ బలంగా ఉన్న మునిసిపాలిటీల్లో టీఆర్‌ఎ్‌సకు గట్టి పోటీ అనివార్యంగానే కనబడుతుంది. పార్టీ అంతర్గత సర్వేల్లోనూ ఇదే తేలిందని, అందుకే అధిష్ఠానం రెబెల్స్‌ విషయంలో కలవరపడుతోందని తెరాస భవన్ వర్గాల సమాచారం. అధికారంలో ఉన్న పార్టీగా తెరాసకు ఈ ఎన్నికల్లో అనుకూలమైన అంశమే అయినప్పటికీ, దాదాపు సగం మునిసిపాలిటీల్లోనయినా  గెలుపు కోసం శ్రమించక తప్పేలా కనబడడం లేదు.  

అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస చేతిలో ఓటమి చెంది అక్కడే ఉండి లోకల్ గా ప్రజలకు అందుబాటులో ఉన్న నేతలున్న చోట తెరాస కు కష్టంగా మారనుంది.  ఓట్ల తేడా పెద్దగా ఉండనప్పటికీ, వార్డులను కోల్పోవాల్సి రావొచ్చు. ఇక తెరాస కు ఉన్న మరో సమస్య ఇతర పార్టీలనుంచి గెల్చిన ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆహ్వానించడం. ఇలా వారిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా వారికి, తెరాస నుండి ఒదిన వారికి మధ్య పొసగడం లేదు. వారి మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయి. 

క్యాడర్ కూడా పూర్తిగా డివైడ్ అయి ఉంది. ఒక వర్గానికి మరో వర్గానికి మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఈ ఇరువురు నేతలు మంత్రుల పర్యటనల సందర్భంగా ఒక వర్గానికి వ్యతిరేకంగా మరో వర్గం బల ప్రదర్శనలకు దిగడం సర్వసాధారణమైన విష్యం అయిపోయింది. 

ఇక ఎమ్మెల్యే స్థాయి నేతలను కాకుండా చాలా మంది రెండవశ్రేణి నాయకులను కూడా తెరాస పార్టీలోకి ఆహ్వానించింది. అన్ని పార్టీలనుంచి కూడా నేతలు వచ్చి చేరారు. దానితో ఇప్పుడు టిక్కెట్లు దక్కని వారు చాలా మంది ఇప్పటికే రెబెల్స్ గా నామినేషన్స్ వేశారు. 

also read  భార్య ప్రాణాలు కాపాడబోయి.. భర్త మృతి

వారందరికీ ఇప్పుడు మద్దతివ్వడానికి కూడా బీజేపీ వెనకాడడం లేదు. నామినేషన్ల ముందు వరకు వారికి బి ఫారాలు ఇవ్వడానికి కూడా వచ్చి చూసింది బీజేపీ. అలా కొందరికి ఇచ్చింది కూడా. ఇప్పుడు రెబెల్స్ ని ఉపసంహరింప చేసుకునే పనిలో తెరాస నిమగ్నమైంది. 

ఈ అన్ని పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణాలో మునిసిపల్ ఎన్నికల వేడి బాగానే ఉండేలా కనబడుతుంది. కాంగ్రెస్ ఏమో అస్థిత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే... మరొపక్కనేమో తెలంగాణాలో తెరాస కు ప్రత్యామ్నాయం మేమె అని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తుంది. 

 

click me!