పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ టీఆర్ఎస్ కు షాకిస్తాడా?... ఎమ్మెల్సీ ఎన్నికల వేళ వివాదంలో మంత్రి కొప్పుల (వీడియో)

By Arun Kumar PFirst Published Nov 29, 2021, 5:02 PM IST
Highlights

టీఆర్ఎస్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ పోటీతో కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నిక రసవత్తరంగా మారిన నేపథ్యంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఓ ఎంపిటిసితో మాట్లాడుతున్నట్లుగా వున్న ఫోన్ కాల్ రికార్డ్ రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. 

కరీంనగర్: తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎన్నికలు జరిగే అన్నిచోట్లా అధికార వైసిపికి స్పష్టమైన ఆధిక్యం వున్నా ఆ పార్టీ నేతల్లో ఆందోళన కనిపిస్తోంది. ఇటీవల జరిగిన హుజురాబాద్ ఎఫెక్ట్ ఏమయినా ఈ ఎన్నికలపై పడుతుందేమోనన్న అనుమానం కరీంనగర్ జిల్లాలో అలజడికి కారణంగా కనిపిస్తోంది. కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ రాజీనామా చేసి కరీంనగర్ ఎమ్మెల్సీ  స్థానానికి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగడంతో టీఆర్ఎస్ అలెర్ట్ అయ్యింది. దీంతో స్థానికసంస్ధల ప్రజాప్రతినిధులు పక్కచూపులు చూడకుండా టీఆర్ఎస్ పెద్దలు జాగ్రత్త పడుతున్నారు. 

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు కలిగిన ప్రజాప్రతినిధులు అసంతృప్తితో వుంటే వారిని TRS పెద్దలు బుజ్జగించే పనిలో పడ్డారు. సామ ధాన భేద దండోపాయాలను ఉపయోగించి అయినా కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఓ ఎంపిటీసితో మంత్రి కొప్పుల ఈశ్వర్ కోపంగా మాట్లాడినట్లుగా ఓ ఫోన్ కాల్ రికార్డ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

వీడియో

 Karimnagar district కు చెందిన ఓ ఎంపిటిసిని మంత్రి కొప్పుల ఫోన్ చేసి పరోక్షంగా బెదిరిస్తున్నట్లుగా ఓ ఫోన్ కాల్ ఆడియో బయటకు వచ్చింది. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ కు సహకరించని ఎంపిటిసిలతో పాటు పార్టీకి చెందిన కొందరు నేతలను దూషించినట్లుగా సదరు ఆడియోలో వుంది. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం, జూలపల్లి మండలాల ఎంపిటిసిల గూర్చి మంత్రి కొప్పుల ప్రస్తావించినట్లు ఫోన్ కాల్ ఆడియో ద్వారా తెలుస్తోంది. 

read more  అధికార టీఆర్ఎస్ పై పోటీ... కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ పై కేసు నమోదు

ఎంపిటిసిలను ఎందుకు జమ చేస్తునవంటూ సొంత పార్టీ నాయకుడిపై కోప్పడ్డ మంత్రి ఇప్పటివరకు ఎంత మందిని జమచేస్తూ అంత మందిని తన వద్దకు తీసుకు రావాలని సూచించారు. వారందరికీ మంచి రివార్డు ఇప్పిస్తానని... పిచ్చకుంట్ల కాంగ్రెస్, బీజేపీ కి ఎంత మంది ఎంపిటిసిలు వున్నారంటూ మండిపడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ కు 900 మంది ఎంపిటిసి లు వున్నారని... ఐదు పది మంది  ఎంపిటిసి పోతే పోనీ... కానీ అందరిని పోగు చేయడం మంచిది కాదంటూ ఓ ఎంపిటిసిని మంత్రి కొప్పుల హెచ్చరించినట్లుగా ప్రచారం జరుగుతోంది. 

''రఘువీర్ సింగ్ అనేటోడు ఉత్త (పిచ్చకుంట్లోడు)ఉంటే ఉంటడు పోతే పోతాడు. పుట్టా మధు కూడా ఉంటే ఉంటాడు పోతే పోతడు. వాడు పోతే వానితో పోతావా నువ్వు'' అంటూ టీఆర్ఎస్ పార్టీకి చెందిన జిల్లా జడ్పీ  ఛైర్ పర్సన్ గురించి కూడా మంత్రి కొప్పుల అసభ్యంగా మాట్లాడినట్లుగా ఓ ఫోన్ కాల్ ఆడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. 

read more  ఎమ్మెల్సీ ఎన్నికలు: రవీందర్ సింగ్ వ్యూహాత్మకం.. కాంగ్రెస్ ఓట్లపై ఫోకస్, జీవన్‌రెడ్డితో మంతనాలు

ఇదిలావుంటే అధికార టీఆర్ఎస్ పార్టీకి స్థానికసంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో హుజురాబాద్ ఉపఎన్నిక తర్వాత టీఆర్ఎస్ లో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయి అధిష్టానంపై ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ స్థానం ఆశించి భంగపడ్డ కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ టీఆర్ఎస్ పై తిరుగుబాటు బావుటా ఎగరేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాడు. 

TRS Party కి రాజీనామా చేసి ఎమ్మెల్సీ బరిలోకి దిగడమే కాదు తనకు మద్దతివ్వాలని అన్ని పార్టీల నాయకులను కలుస్తున్నారు రవీందర్ సింగ్. ఇప్పటికే కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్లు జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబును కలిసి తనకు మద్దతివ్వాలని రవీందర్ కోరాడు. ఇక బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంపూర్ణ మద్దతు వున్నట్లు ప్రచారం జరుగుతోంది. రవీందర్ వెనకుండి నడిపిస్దున్నది ఈటలే అని రాజకీయంగా చర్చ జరుగుతోంది. 

 

 

 

click me!