ఇంతకంటే మంచి పోజిషన్ ఇస్తుందేమో : ఎమ్మెల్సీ టికెట్ నిరాకరణపై అద్దంకి దయాకర్ స్పందన

By Siva Kodati  |  First Published Jan 17, 2024, 7:17 PM IST

తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో భర్తీ కానున్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అద్దంకి దయాకర్‌కు కాంగ్రెస్ పార్టీ షాకిచ్చింది. ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్‌లను ఎంపిక చేసింది.


తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో భర్తీ కానున్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అద్దంకి దయాకర్‌కు కాంగ్రెస్ పార్టీ షాకిచ్చింది. ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్‌లను ఎంపిక చేసింది. తొలుత ఈ జాబితాలో అద్దంకి దయాకర్ పేరు వినిపించింది. అంతేకాదు.. నామినేషన్ పత్రాలను కూడా సిద్ధం చేసుకోవాలని హైకమాండ్ నుంచి అద్దంకికి ఫోన్ వచ్చిందట. దీంతో ఆయన అభిమానులు, మద్ధతుదారులు సంబరాలు చేసుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయన స్థానంలో మహేశ్ కుమార్ గౌడ్ పేరును హైకమాండ్ ప్రకటించడంతో అద్దంకి దయాకర్ నిరాశకు గురయ్యారు. 

దీనిపై ఆయన స్పందించారు. ఈ విషయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి వుంటానని దయాకర్ తెలిపారు. తనను ఇంతకుమించిన స్థానంలో పెట్టాలని పార్టీ చూస్తోందని భావిస్తున్నట్లు అద్దంకి అన్నారు. తనకు ఎమ్మెల్సీ టికెట్ రాకపోవడం వెనుక ఏదో కుట్ర జరిగిందని భావించడం సరైనది కాదన్నారు. పార్టీకి విధేయునిగా అధిష్టానం నిర్ణయాలను గౌరవించాల్సిన అవసరం తనపై వుందని అద్దంకి దయాకర్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా పాలనను ముందుకు తీసుకుపోవడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. 

Latest Videos

ఇకపోతే.. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా వున్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ విడుదల చేశారు. రేపటితో నామినేషన్ల దాఖలకు గడువు ముగియనుండగా.. 29న పోలింగ్ జరగనుంది. అదే రోజున ఫలితాలను ప్రకటించనున్నారు. 

click me!