Rythu Bandhu: రైతులకు గుడ్ న్యూస్ .. రేపటి నుంచి ఖాతాల్లో రైతు బంధు డబ్బులు: మంత్రి తుమ్మల వెల్లడి

By Mahesh K  |  First Published Jan 17, 2024, 6:24 PM IST

రైతు బంధు నిధులు రేపటి నుంచి రైతుల ఖాతాల్లో జమ అవుతాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ నెలాఖరులోపు రైతు బంధు డబ్బులు రైతులందరికీ అందుతాయని చెప్పారు. రెండు లక్షల రైతుల రుణామఫీని దశల వారీగా చేపడుతామని వివరించారు.
 


Rythu Bandhu: రైతు బంధు డబ్బుల కోసం ఇప్పటికీ రైతులు ఎదురుచూస్తున్నారు. రైతు బంధు డబ్బులు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం అందిస్తున్నది. ఇప్పటికే ఎప్పుడో ఈ డబ్బులు రైతులకు అందాల్సింది. కానీ, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక పరమైన చిక్కులతో ఈ డబ్బుల విడుదలలో జాప్యం జరిగింది. ఇప్పటికీ ఈ డబ్బులు ఎప్పుడు పడతాయోనని రైతులు ఎదురుచూస్తున్నారు. రెండెకరాల లోపు సాగు భూమి గల రైతులకు డబ్బులు విడుదలయ్యాయి. కానీ, మిగిలిన రైతులకు ఇంకా విడుదల కాలేవు. రైతు బంధుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాజాగా కీలక అప్డేట్ ఇచ్చారు.

నిజామాబాద్ జిల్లా పర్యటనలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం రైతు డిక్లరేషన్ అమలుకు కట్టుబడి ఉన్నదని స్పష్టం చేశారు. రైతు సంక్షేమమే తమ ధ్యేయం అని పేర్కొన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు. రేపటి నుంచి రైతుబంధు డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. ఈ నెలాఖరులోగా రాష్ట్రంలోని అందరి రైతులకు రైతు బంధు డబ్బులు అందుతాయని వివరించారు. ఇప్పటి వరకు రెండుకరాలు కలిగిన 29 లక్షల మంది రైతులకు రైతు బంధు అందించామని చెప్పారు.

Latest Videos

Also Read: Bihar: మొబైల్ దొంగిలిస్తుండగా పట్టుకున్న ప్రయాణికులు.. ట్రైన్ కిటికీ నుంచి వేలాడిదీసిన వీడియో వైరల్

రుణ మాఫీపైనా మంత్రి తుమ్మల కీలక విషయాన్ని తెలియజేశారు. రెండు లక్షల వరకు రైతుల రుణ మాఫీ చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నదని వివరించారు. అయితే, ఈ రుణ మాఫీ దశల వారీగా జరుగుతుందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతాంగ ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు.

click me!