పీయూష్ గోయల్‌ను కలిసిన కేటీఆర్, గంగుల : ధాన్యం సమస్యలపై విజ్ఞప్తి

By Siva KodatiFirst Published Sep 1, 2021, 9:48 PM IST
Highlights

కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను తెలంగాణ మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్‌ కలిశారు. ఈ సందర్భంగా ధాన్యం సమస్యలపై పీయూష్ గోయల్‌కు మంత్రులు విజ్ఞప్తి చేశారు. రైతులకు మద్ధతుగా నిలవాలని తెలంగాణ మంత్రులు కోరారు.

కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను తెలంగాణ మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్‌ కలిశారు. ఈ సందర్భంగా ధాన్యం సమస్యలపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు మంత్రులు విజ్ఞప్తి చేశారు. రైతులకు మద్ధతుగా నిలవాలని తెలంగాణ మంత్రులు కోరారు. యాసంగిలో 80-90 శాతం పారాబాయిల్డ్ రైస్ లిమిట్ పెంచాలని విజ్ఞప్తి చేశారు. యాసంగి ధాన్యం రారైస్‌గా చేస్తే విరిగిపోయి నష్టపోతామని మంత్రులు అన్నారు.

రాబోయే కాలంలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తీసుకోవాలని కోరారు. ఈ రబీలో సైతం 50 లక్షల మెట్రిక్ టన్నలు పారాబాయిల్డ్ రైస్ ఇస్తామని మంత్రులు తెలిపారు. గతంలో కోల్పోయిన 2019-20 రబీ సీఎంఆర్ డెలివరీ 30 రోజులు పెంచాలని తెలంగాణ మంత్రులు విజ్ఞప్తి చేశారు. తాలు, తేమ నిబంధనలు మార్చితే రైతులు తీవ్రంగా నష్టపోతారని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మాదిరి కొనసాగించి రైతులకు కేంద్రం అండగా వుండాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. 
 

click me!