24 గంటల్లో 332 మందికి పాజిటివ్.. తెలంగాణలో 6,58,054కి చేరిన కేసుల సంఖ్య, హైదరాబాద్‌లో తీవ్రత

Siva Kodati |  
Published : Sep 01, 2021, 08:58 PM IST
24 గంటల్లో 332 మందికి పాజిటివ్.. తెలంగాణలో 6,58,054కి చేరిన కేసుల సంఖ్య, హైదరాబాద్‌లో తీవ్రత

సారాంశం

తెలంగాణలో కొత్తగా 332 కరోనా కేసులు నమోదవ్వగా.. ముగ్గురు మృతి చెందారు. 331 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 5,852 యాక్టివ్‌ కేసులు వున్నాయి.  

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 71,402 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 322 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 6,58,376కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో  తెలంగాణలో ఇప్పటివరకు వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,876కి చేరింది. మహమ్మారి  బారి నుంచి నిన్న 331 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రస్తుతం 5,852 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.   

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 1, భద్రాద్రి కొత్తగూడెం 9, జీహెచ్ఎంసీ 76, జగిత్యాల 13, జనగామ 4, జయశంకర్ భూపాలపల్లి 2, గద్వాల 0, కామారెడ్డి 2, కరీంనగర్ 27, ఖమ్మం 13, మహబూబ్‌నగర్ 3, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 11, మంచిర్యాల 5, మెదక్ 0, మేడ్చల్ మల్కాజిగిరి 20, ములుగు 2, నాగర్ కర్నూల్ 4, నల్గగొండ 17, నారాయణపేట 0, నిర్మల్ 3, నిజామాబాద్ 4, పెద్దపల్లి 15, సిరిసిల్ల 7, రంగారెడ్డి 22, సిద్దిపేట 6, సంగారెడ్డి 2, సూర్యాపేట 7, వికారాబాద్ 3, వనపర్తి 4, వరంగల్ రూరల్ 9, వరంగల్ అర్బన్ 25, యాదాద్రి భువనగిరిలో 6 చొప్పున కేసులు నమోదయ్యాయి.


 

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu