రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అక్రమమే: వేముల ప్రశాంత్ రెడ్డి

By narsimha lode  |  First Published Jun 24, 2021, 4:41 PM IST

 రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అక్రమమేనని తెలంగాణ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు.
గురువారం నాడు  తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి టీఆర్ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 


హైదరాబాద్: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అక్రమమేనని తెలంగాణ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు.గురువారం నాడు  తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి టీఆర్ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 

కృష్ణా నీటిని ఏపీ అక్రమంగా   తరలించుకుపోతోందన్నారు.   రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులకు ఏపీ ప్రభుత్వం జీవో ఇచ్చిన ఏడు రోజుల్లోనే కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు లేఖ రాసినట్టుగా ఆయన గుర్తు చేసుకొన్నారు. పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంచిందే కాంగ్రెస్ పార్టీ హయంలోనే అని ఆయన చెప్పారు. 

Latest Videos

undefined

also read:ఆ వ్యాఖ్యలు ఆంధ్రప్రజలను ఉద్దేశించినవి కావు: మంత్రి వేముల

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  పోతిరెడ్డి పాడు కాల్వల విస్తరణ పనులను అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారన్నారు. మాజీ మంత్రి డికె అరుణ రాజశేఖర్ రెడ్డికి హరతులు పట్టారని ఆయన విమర్శించారు. అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఈ పనులకు కొబ్బరికాయ కొట్టారని ఆయన మండిపడ్డారు. 

పోతిరెడ్డిపాడు విస్తరణ పనులకు నిరసనగా వైఎస్ఆర్ కేబినెట్ నుండి టీఆర్ఎస్ వైదొలిగిందని ఆయన గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తోందన్నారు.  ఈ విషయమై కేఆర్ఎంబీకి, కేంద్రానికి ఫిర్యాదు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. 

ఈ విషయమై పనులు నిర్వహించొద్దని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసిందన్నారు. అయినా కూడ ఏపీ ప్రభుత్వం పనులు నిర్వహిస్తోందని ఆయన మండిపడ్డారు.   గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను పాటించని ఏపీ ప్రభుత్వం విషయంలో ఏం సమాధానం చెబుతారని ఆయన  బీజేపీ, కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. 

click me!