కేంద్ర ప్రభుత్వ స్థలాన్నే కబ్జా చేసి... అమ్ముకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు: కాంగ్రెస్ ఎమ్మెల్సీ సంచలనం (వీడియో)

By Arun Kumar PFirst Published Jun 24, 2021, 3:38 PM IST
Highlights

సామాన్యుడు లేఖ రాస్తే మంత్రివర్గంలోని ఈటెల రాజేందర్ పైనే చర్య తీసుకున్న సీఎం కేసీఆర్ ఓ ఎమ్మెల్సీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అక్రమాలపై రాసిన లేఖపై ఎందుకు స్పందించడం లేదని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. 
 

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూర్ గ్రామంలో ఖాదీ భాండార్ కు చెందిన 57గుంటల స్థలం అక్రమ రిజిస్ట్రేషన్ కు గురయ్యిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ ను రద్దు చెయ్యాలని సీఎం కేసీఆర్ కు తాను ఇప్పటికే లేఖ ఎలాంటి స్పందన లేదన్నారు. సామాన్యుడు లేఖ రాస్తే మంత్రివర్గంలోని ఈటెల రాజేందర్ పైనే చర్య తీసుకున్న సీఎం ఓ ఎమ్మెల్సీ రాసిన లేఖపై ఎందుకు స్పందించడం లేదని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. 

''కోరుట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ప్రభుత్వ ఆస్తిని ఎలాంటి ప్రకటనలు లేకుండా అమ్మడం హేయమైన చర్య. కేంద్ర ప్రభుత్వ ఆస్తిని అమ్మే అధికారం ఎవ్వరికీ లేదు. 12కోట్లు విలువ చేసే భూమిని దొంగచాటుగా కేవలం కోటీ25 లక్షలకే అమ్ముకున్నారు. కాబట్టి తక్షణమే రిజిస్ట్రేషన్ రద్దు చేసి ఈ స్థలాన్ని నేత కార్మికులకు కేటాయించాలి'' అని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. 

వీడియో

''అధికార పార్టీ నాయకులు అందరూ కలిసి కార్మికులను మోసం చేస్తున్నారు. ఈ భూ లావాదేవీల్లో ఉన్న చొప్పదండి ఎమ్మెల్యే, కోరుట్ల ఎమ్మెల్యే, కోడిమ్యాల ఎంపీపీ, సింగిల్ విండో ఛైర్మెన్ అందరూ టీఆరెస్ వాళ్లే. ఇంత జరుగుతుంటే టెక్స్ టైల్ శాఖ మంత్రి కేటీఆర్ ఎందుకు మాట్లాడటం లేదు. ఆఞన ఒక్క సిరిసిల్లాకే మంత్రా లేక రాష్ట్రం మొత్తానికి మంత్రా? కోట్ల కుంభకోణం జరుగుతున్నా ఎందుకు మౌనంగా వున్నారు" అని జీవన్ రెడ్డి నిలదీశారు. 


 

click me!