హైద్రాబాద్ నగరంలో ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాల ఏర్పాట్లపై మంత్రి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. బోనాల ఏర్పాట్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లను చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్: ఆషాడ మాసంలో నగరంలోని పలు ఆలయాల్లో నిర్వహిం,చే బోనాల పండుగ ఏర్పాట్లపై తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి Talasani Srinivas Yadav గురువారం నాడు సమీక్ష నిర్వహించారు.
hyderabad మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో Bonalu ఏర్పాట్లపై మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు.
Ashadam Bonalu ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి చెప్పారు. కరోనా కారణంగా రెండు సంవత్సరాల పాటు బోనాలు నిర్వహించుకోలేక పోయిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
undefined
ఈ నెల 17 న Secunderabad మహంకాళి అమ్మవారి బోనాలు ఈ నెల 24 న ఓల్డ్ సిటీ బోనాలు నిర్వహించనున్నట్టుగా మంత్రి చెప్పారు.ఈ బోనాలకు రాష్ట్ర ప్రభుత్వం తర్వాత అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి చెప్పారు.
ఈ నెల18 న మహంకాళి అమ్మవారి అంబారీ ఊరేగింపు, ఈ నెల 25 న ఉమ్మడి దేవాలయాల అంబారీ ఊరేగింపు నిర్వహిస్తామన్నారు. ప్రధాన దేవాలయాల వద్ద సాంస్కృతిక శాఖ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.
Charminar వద్ద 500 మంది కళాకారులతో కళాప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్టుగా మంత్రి వివరించారు. గతంలో నిర్వహించిన బోనాల పండుగ కంటే భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని మంత్రి చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణకు అదనపు పోలీసు సిబ్బంది ఏర్పాటు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు.