హైద్రాబాద్ శంషాబాద్ వద్ద శాఫ్రాన్ సంస్థ యూనిట్లను తెలంగాణ మంత్రి కేటీఆర్ గురువారం నాడు ప్రారంభించారు. విమానాల ఇంజన్ల తయారీ, మరమ్మత్తులతో పాటు ఓవరహల్ సెంటర్ లను ఈ సంస్థ ఏర్పాటు చేసింది.రూ. 1200 కోట్లతో ఈ సంస్థ ఈ యూనిట్లు ప్రారంభించింది.
హైదరాబాద్: Aeroplane ఇంజన్ల తయారీ, మరమ్మత్తు , ఓవర్ హాల్ కేంద్రాన్ని France కు చెందిన Sarran కంపెనీ Hyderabad లో ఏర్పాటు చేసింది. ఈ కంపెనీ యూనిట్ ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం నాడు ప్రారంభించారు.
ఈ సందర్భంగా KTR ప్రసంగించారు. 2020 నుండి శాఫ్రాన్ కంపెనీతో చర్చలు జరుపుతున్నట్టుగా ఆయన చెప్పారు.ప్రపంచ గుర్తింపు తెచ్చుకొనేస్థితిలో ఈ సెంటర్ చేరుకుంటుందని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున శాప్రాన్ సంస్థకు అన్ని రకాల సహాయ సహాకారాలను అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.రానున్న రోజుల్లో హైద్రాబాద్ లో ఏరోస్పేస్, ఏవియేషన్ సంస్థలు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తుంది.
undefined
హైద్రాబాద్ Shamshabad లో శాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ ఎంఆర్ఐ ఫెసిలిటీ సెంటర్ ను మంత్రి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఫ్రాన్స్ కు చెందిన కంపెనీ రూ. 1200 కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్లను ఏర్పాటు చేయనుంది. విమాన ఇంజన్లకు సంబంధించి వైర్ హార్నెస్ లకు ఉత్పత్తి చేసేందుకు గాను శాఫ్రాన్ ఎలక్ట్రికల్ పవర్ ఫ్యాక్టరీ యూనిట్ ఏర్పాటు చేశారు. శాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ ఫ్యాక్టరీలో విమానాల ఇంజన్ల బాగాలను తయారు చేయనున్నారు.
ఈయూనిట్లలో విమానాల్లో వాడే లీవ్ 1, లీవ్ 1 బి ఇంజన్లు శాఫ్రాన్ కంపెనీ తయారు చేయనుంది. ఈ యూనిట్ల ద్వారా సుమారు వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. హెలికాప్టర్ల తయారీ కోసం కూడా హెచ్‌సీఎల్ తో ఒప్పందం చేసుకున్నట్టుగా ఆ సంస్థ సీఈఓ ఒలివీర్ ఆండ్రీస్ చెప్పారు.