డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై రాజకీయ డ్రామాలు: కిషన్ రెడ్డి అరెస్ట్‌పై తలసాని శ్రీనివాస్ యాదవ్

By narsimha lode  |  First Published Jul 20, 2023, 12:53 PM IST

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో బీజేపీ నేతల తీరుపై  తెలంగాణ మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్  మండిపడ్డారు.


హైదరాబాద్: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై బీజేపీ నేతలు  రాజకీయ డ్రామాలు  చేస్తున్నారని  తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. గురువారంనాడు ఉదయం  హైద్రాబాద్ లో  మంత్రి శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ చలో బాట సింగారం కార్యక్రమంతో పాటు కిషన్ రెడ్డి అరెస్ట్ పై  ఆయన  స్పందించారు.  

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించడం లేదని  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  అభిప్రాయపడ్డారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై బీజేపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారన్నారు.  

Latest Videos

undefined

also read:నన్ను చంపేయండి: కిషన్ రెడ్డి, శంషాబాద్ ఓఆర్ఆర్ వద్ద కేంద్ర మంత్రి సహా బీజేపీ నేతల అరెస్ట్

పేదలు గొప్పగా బతకాలన్న ఆలోచనతో డబుల్ బెడ్ రూమ్  ఇళ్ల నిర్మాణం చేపట్టారని  మంత్రి   చెప్పారు. అన్ని హంగులతో, మౌళిక సదుపాయాలతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను  నిర్మించినట్టుగా  మంత్రి గుర్తుచేశారు. ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణానికి  రూ. 8.6 లక్షలను  ఖర్చు చేస్తున్నామని తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.  డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి  ఒక్క పైసా కూడ ఇవ్వలేదని  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.  

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ ఆలస్యమైన విషయం వాస్తవమేనన్నారు.  చలో బాటసింగారం కార్యక్రమాన్ని ఎందుకు  పిలుపునిచ్చారో అర్థం కావడం లేదన్నారు.  కేంద్ర మంత్రి వస్తానంటే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను తాను చూపిస్తానన్నారు.  కేంద్ర మంత్రి హోదాలో  కిషన్ రెడ్డి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఎప్పుడైనా  పరిశీలించవచ్చన్నారు. 

రాజకీయంగా వెనుకబడ్డామనే భావనతో  ఇలాంటి కార్యక్రమాలను బీజేపీ  చేపట్టిందన్నారు.   పేదల సమస్యలు తమకు తెలియవా అని తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.   లబ్దిదారుల ఎంపికలో  పారదర్శకత పాటిస్తున్నట్టుగా  చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి గతంలో పలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను  ప్రారంభించిన విషయాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గుర్తు  చేసుకున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని కిషన్ రెడ్డి ప్రశంసించినట్టుగా ఆయన ఈ సందర్భంగా  ప్రస్తావించారు. 
 

click me!