జోగిని శ్యామలకు మంత్రి తలసాని కౌంటర్: కొన్ని ఇబ్బందులు జరిగాయి

First Published Jul 30, 2018, 4:55 PM IST
Highlights

లక్షలాది మంది భక్తులు వచ్చిన సమయంలో కొన్ని లోటుపాట్లు జరగడం సహజమేనని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

హైదరాబాద్: లక్షలాది మంది భక్తులు వచ్చిన సమయంలో కొన్ని లోటుపాట్లు జరగడం సహజమేనని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.  ఈ సౌకర్యాన్ని అర్థం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జోగిని శ్యామలకు సూచించారు.

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ఈ ఉత్సవాలకు విదేశాల నుండి కూడ పెద్ద ఎత్తున పర్యాటకులు హజరయ్యారని ఆయన గుర్తు చేశారు. సోమవారం నాడు రంగం తర్వాత  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.  రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతోందని  వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు.

 జోగిని శ్యామల కొంత ఇబ్బంది పడినట్టు తాను విన్నానన్నారు. చిన్న చిన్న అసౌకర్యాలు కలిగినప్పుడు అర్థం చేసుకోవాలన్నారు.  కొన్ని ఇబ్బందులు ఎదురైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

విఐపీలు ఎక్కువగా ఉన్న సమయంలో  భక్తులు ఇబ్బందిపడ్డారని ఆయన చెప్పారు. జోగిని శ్యామలకు ఆలయ పరిస్థితులు పూర్తిగా తెలుసునని చెప్పారు. ప్రభుత్వానికి జోగిని శ్యామల శాపనార్థాలు పెట్టడం సరైంది కాదన్నారు.

ఈ వార్తను చదవండి:జోగిని శ్యామల మాటలు నిజమౌతాయి: వీహెచ్

 

"

click me!