మూడు తరాలకు గుర్తుండే నటుడు: కైకాల సత్యనారాయణకు మంత్రి తలసాని నివాళులు

Published : Dec 23, 2022, 12:39 PM ISTUpdated : Dec 23, 2022, 04:53 PM IST
మూడు తరాలకు  గుర్తుండే నటుడు: కైకాల సత్యనారాయణకు మంత్రి తలసాని నివాళులు

సారాంశం

టాలీవుడు నటుడు కైకాల సత్యనారాయణ  పార్థీవదేహనికి  తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  నివాళులర్పించారు.మూడు తరాల ప్రజలకు  సత్యనారాయణ గుర్తుండేవారన్నారు.   

హైదరాబాద్: మూడు తరాల ప్రజలకు కైకాల సత్యనారాయణ గుర్తుండే నటుడని  తెలంగాణ సినిమాటోగ్రఫీ  శాఖ మంత్రి  తలసాని సత్యనారాయణ  చెప్పారు.ప్రముఖ సినీ నటుడు కైకాల సత్యనారాయణ శుక్రవారంనాడు తెల్లవారుజామున మృతి చెందాడు.   ఇవాళ  సత్యనారాయణ పార్థీవ దేహనికి  మంత్రి నివాళులర్పించారు.  ఈ సందర్భంగా  ఆయన మీడియాతో మాట్లాడారు.నటుడు, విలన్ గా,క్యారెక్టర్ ఆర్టిస్టుగా  ఎన్నో గొప్ప చిత్రాల్లో  సత్యనారాయణ నటించారన్నారు.770 సినిమాల్లో  సత్యనారాయణ  నటించారని మంత్రి గుర్తు చేశారు. కైకాల సత్యనారాయణ మృతి సమాజానికి, తెలుగు చలనచిత్రానికి తీరని లోటన్నారు.  

రాజకీయాల్లో  కూడా కైకాల సత్యనారాయణ  రాణించారన్నారు. మచిలీపట్టణం నుండి  సత్యనారాయణ  ఎంపీగా  ప్రాతినిథ్యం వహించారని  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గుర్తు చేశారు. కైకాల సత్యనారాయణ నటనను చూసి  ఎన్టీఆర్ కూడా  ఎంతో సంతోషించేవారని ఆయన గుర్తు చేసుకున్నారు.ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు,   కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు సినిమాల్లో  సత్యనారాయణ  నటించారని  మంత్రి  ప్రస్తావించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Drunk & Drive Test in Ramagundam: పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబులు| Asianet News Telugu
Hyderabad : జీరో మైలురాయి ఎక్కడుంది.. హైదరాబాద్ దూరాన్ని ఎక్కడినుండి కొలుస్తారో తెలుసా..?