కృష్ణంరాజు మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరనిలోటు: తలసాని శ్రీనివాస్ యాదవ్

By narsimha lodeFirst Published Sep 11, 2022, 7:47 PM IST
Highlights

ప్రముఖ సినీ నటులు కృష్ణం రాజు మృతి పట్ల తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు. కృష్ణంరాజు మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరనిలోటన్నారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులను తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. 

హైదరాబాద్: ప్రముఖ సినీ నటులు రెబెల్ స్టార్ కృష్ణంరాజు అకాల మరణం బాధాకరమని  తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. హైద్రాబాద్ జూబ్లీహిల్స్ లోని  కృష్ణంరాజు నివాసంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్  ఆదివారం నాడు కృష్ణంరాజు పార్దీవదేహనికి నివాళులు అర్పించారు. అనంతరం కృష్ణంరాజు సతీమణి, ప్రముఖ హీరో ప్రభాస్ ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు  సానుభూతి ని తెలిపారు. 

 ఈ సందర్భంగా మంత్రి  మీడియాతో మాట్లాడారు. కటకటాల రుద్రయ్య, మన ఊరి పాండవులు, భక్త కన్నప్ప, తాండ్ర పాపారాయుడు వంటి అనేక గొప్ప చిత్రాలలో నటించి కోట్లాది మంది మృదయాల్లో కృష్ణంరాజు అభిమానం సాధించుకున్నారన్నారు.సినిమా, రాజకీయ రంగాల్లో కృష్ణంరాజు రాణించారన్నారు. ఏ రంగంలో ఉన్నా కూడా పేదలకు సహయం చేసేందుకు కృష్ణంరాజు ముందుండేవాడని ఆయన గుర్తు చేసుకున్నారు.  ఇటీవల వచ్చిన రాదేశ్యామ్ చిత్రంలో కూడా  కృష్ణంరాజు నటించారని ఆయన గుర్తు చేశారు. అందరితో ఎంతో కలుపుగోలుగా ఉండే మంచి వ్యక్తిగా  కృష్ణంరాజుకు పేరుందన్నారు. 

కృష్ణంరాజు లాంటి  గొప్ప వ్యక్తి మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటుగా ఆయన పేర్కొన్నారు.. ప్రభాస్ గొప్ప నటుడిగా రాణించడం పట్ల కృష్ణంరాజు ఎప్పుడు ఎంతో గర్వంగా పీలయ్యేవాడన్నారు. కృష్ణంరాజు ఆత్మకు శాంతి చేకూర్చాలని వారి కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు అన్నారు.

click me!