బండి సంజయ్ ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు: మంత్రి తలసాని ఫైర్

Published : Jul 11, 2022, 03:42 PM IST
బండి సంజయ్ ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు: మంత్రి తలసాని ఫైర్

సారాంశం

దేశంలో బీజేపీయేతర పార్టీల ప్రభుత్వాలను పడగొట్టడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ పనిచేస్తున్నారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం మాట్లాడితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏం మాట్లాడారో అర్ధం కావడం లేదన్నారు. 

హైదరాబాద్: దేశంలో బీజేపీయేతర పార్టీల ప్రభుత్వాలను పడగొట్టడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ పనిచేస్తున్నారని తెలంగాణ మంత్రి Talasani Srinivas Yadav చెప్పారు. 

సోమవారం నాడు TRS  శాసనసభపక్ష కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రలో ఇటీవల జరిగిన పరిణామాలను ఆయన ప్రస్తావించారు. గతంలో మధ్యప్రదేశ్, కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో BJP ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందో ప్రజలకు తెలుసునన్నారు.తెలంగాణకు KCR  శ్రీరామరక్షగా ఉంటాడని ప్రజలు భావిస్తున్నారని మంత్రి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పండిండిచిన Paddy  ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేసినా  కూడా కేంద్రం కనికరించలేదన్నారు. 

Telangana లో అన్ని దేవాలయాలను అభివృద్ది చేసిన ఘనత కూడా సీఎం కేసీఆర్‌దేనన్నారు. మతాలకు అతీతంగా అన్ని పండుగలన  రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.  బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టడమే లక్ష్యంగా నరేంద్ర మోడీ పనిచేస్తున్నాడని ఆయన మండిపడ్డారు.  దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న విషయం బీజేపీ నేతలకు కన్పించడం లేదా అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. 

ఎనిమిదేళ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందని  మంత్రి తలసాని అడిగారు. బీసీల ఆత్మగౌరవ భవనాల కోసం కోట్లాది రూపాయాల విలువ చేసే భూములు  కేటాయించినట్టుగా మంత్రి చెప్పారు. పోడు భూముల సమస్య  ప్రధానంగా కేంద్రానికి సంబంధించిందన్నారు. రాష్ట్రాల విభజన సమయంలో ఏపీ పునర్విభజన హామీలను అమలు చేస్తామని ఇచ్చిన హామీ ఇంతవరకు అమలు కాలేదన్నారు. విభజన చట్టంలో పొందుపర్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అడిగారు.

కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తే అందరం కలిసి ఎన్నికలకు పోదామని సీఎం కేసీఆర్ అన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గుర్తు చేశారు. ఎవరిని అధికారంలోకి తీసుకురావాలో ప్రజలే నిర్ణయిస్తారని కేసీఆర్ చెప్పిన మాటలను మంత్రి గుర్తు చేశారు. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏది పడితే అది మాట్లాడుతున్నాడని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు.  

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో లక్ష రూపాయాలైనా ఖర్చు చేశారా అని మంత్రి ప్రశ్నించారు.  పోడు భూముల సమస్యలపై విపక్షాలు ఎందుకు ధర్నాలు చేస్తున్నాయో అర్ధం కావడం లేదన్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?