తెలంగాణలో భారీ వర్షాలు, వరదలపై కేసీఆర్ సమీక్ష: గోదావరి వరదపై ఆరా

By narsimha lode  |  First Published Jul 11, 2022, 2:43 PM IST

భారీ వర్షాలు, వరదలపై తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు ప్రగతి భవన్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని సీఎం ఆదేశించారు.


హైదరాబాద్: Telangana  రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపఃథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని తెలంగాణ సీఎం KCR  అధికారులను ఆదేశించారు.సోమవారం నాడు ప్రగతి భవన్ లో భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు కురుస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. 

చెరువులు, కుంటలు, డ్యామ్ లు, రిజర్వాయర్లలో నీటి పరిస్థితిని సీఎం కేసీఆర్ ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని కేసీఆర్ ఆదేశించారు. Godavari ఉప నదుల్లో వరద పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. వరద పరిస్థితి ఎలా ఉందనే విషయమై అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

Latest Videos

భారీ వర్షాల నేపథ్యంలో ఎగువ ప్రాంతం నుండి ఎన్ని క్యూసెక్కుల నీరు వస్తుందనే విషయమై కూడా అధికారులను అడిగారు.  ఆదివారం మధ్యాహ్నం కూడా తెలంగాణ సీఎం రాష్ట్రంలో వరదలు, వర్షాలపై సమీక్ష నిర్వహించారు. అందుబాటులో ఉన్న మంత్రులు, అధికారులతో సీఎం సమీక్షించారు. తెలంగాణకు వాతావరణ శాఖ Red Alert  జారీ చేసిన నేపథ్యంలో  అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. 

click me!