జూన్ 30 తెలంగాణ టెన్త్ పరీక్ష ఫలితాలు: విడుదల చేయనున్న మంత్రి సబితా

By narsimha lode  |  First Published Jun 28, 2022, 5:06 PM IST

తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జూన్ 30న టెన్త్ క్లాస్ పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నారు.  ఈ ఏడాది మే 23 నుండి జూన్ 1 వరకు టెన్త్ పరీక్షలను ప్రబుత్వం నిర్వహించింది. 11 ప్రశ్నాపత్రాలకు బదులుగా ఆరు ప్రశ్నపత్రాలకే ఈ దఫా పరీక్షలను కుదించారు. 


హైదరాబాద్:ఈ నెల 30వ తేదీన తెలంగాణ Tenth Class పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నారు. టెన్త్ పరీక్ష ఫలితాలను మంత్రి Sabihta Indra Reddy విడుదల చేస్తారు. ఈ నెల 28న Telangana ఇంటర్ పరీక్షా పలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది మే 23 నుండి జూన్ 1వ తేదీ వరకు Exams నిర్వహించారు. ఉదయం తొమ్మిదిన్నర నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. తెలంగాణలో 05,09,275 మంది విద్యార్ధులు పరీక్షలు రాశారు. విద్యార్ధులు పరీక్షలు రాసేందుకు గాను 2861 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో 70 శాతం సిలబస్ తోనే పరీక్షలు నిర్వహించారు.అంతేకాదు 11 పరీక్ష పేపర్లకు బదులుగా ఆరు పేపర్లకు మాత్రమే కుదించారు. 

Latest Videos

undefined

ఇవాళ విడుదల చేసిన ఇంటర్ పలితాల్లో  అమ్మాయిలే పై చేయి సాధించారు. ఈ ఏడాది ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌తో కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్‌ ఫలితాల్లో అమ్మాయిలే పైచేయి సాధించారు.    ఇంటర్ ఫస్టియర్‌లో 63.32 శాతం, సెకండియర్‌లో 67. 82 శాతం ఉత్తీర్ణత నమోదైందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.. ఇంటర్ ఫస్టియర్‌ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా ఫస్ట్ ప్లేస్‌లో, హన్మకొండ సెకండ్ ప్లేస్‌లో నిలిచాయని వెల్లడించారు. ఈ నెల 30 నుంచి సప్లిమెంటరీ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్టుగా చెప్పారు. ఆగస్టు ఒకటి నంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు  నిర్వహించనున్నట్టుగా తెలిపారు. ఆగస్టు చివరినాటికి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఇస్తామని పేర్కొన్నారు. 

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలను జూలై 1న మంత్రి  స‌బితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. 
 జూన్ 12న నిర్వహించిన టెట్ పరీక్షను ప్రశాంతంగా ముగిసిన సంగతి త తెలిసిందే. టెట్‌ పరీక్ష పేపర్‌–1 ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు జ‌రిగింది. అలాగే పేపర్‌–2 మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు జ‌రిగింది. ఈ ప‌రీక్ష‌కు 90 శాతం మంది హాజ‌రైన‌ట్టు క‌న్వీన‌ర్ తెలిపారు. టెట్‌కు మొత్తం 6,29,382 మంది దరఖాస్తు చేసుకోగా 5,69,576 మంది పరీక్షకు హాజరయ్యారు.

1,480 కేంద్రాల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన పేపర్-1 పరీక్షకు 3,51,468 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా 3,18,506 మంది హాజరయ్యారు. అలాగే 1,203 కేంద్రాల్లో మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పేపర్-2కు 2,77,900 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా వారిలో 2,51,070 మంది  హాజరయ్యారు. ఒక, ఐదేళ్లలో తర్వాత టెట్ ఎగ్జామ్‌ను నిర్వహించడంతో ఈసారి బీఈడీ అభ్యర్థులకు పేపర్ 1 రాసేందుకు అవకాశమిచ్చినట్టుగా విద్యాశాఖ పేర్కొంది.
 

click me!