విధుల్లో నిర్లక్ష్యం: 38 ఇంజనీర్ల ఒక్క రోజు సాలరీ కట్ చేసిన జీహెచ్ఎంసీ కమిషనర్

By narsimha lodeFirst Published Jun 28, 2022, 4:41 PM IST
Highlights

 విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇంజనీరింగ్ అధికారులపై జీహెచ్ఎంసీ కమిషనర్ చర్యలకు దిగారు. 38 ఇంజనీరింగ్ అధికారుల ఒక్క రోజు వేతనం కట్ చేస్తూ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.

హైదరాబాద్: విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇంజనీరింగ్ అధికారులపై GHMC  కమిషనర్ Lokesh Kumar  ఆగ్రహం వ్యక్తం చేశారు.   విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇంజనీర్ల ఒక్క రోజు వేతనాన్ని కట్ చేశారు జీహెచ్ఎంసీ Commissioner లోకేష్ కుమార్. గ్రేటర్ నాలాల దగ్గర ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమైన ఇంజనీరింగ్ అధికారులపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకున్నారు. వర్షాకాలం రావడానికి ముందే నాలాల విషయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరినా కూడా చర్యలు తీసుకోలేదు. మంగళవారం నాడు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ముందు జాగ్రత్త చర్యలు తీసుకోని 38 మంది ఇంజనీరింగ్ అధికారుల ఒక్క రోజు వేతనాలను కట్ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. నాలాలపై జాగ్రత్తలు తీసుకోని అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని కమిషన్ తేల్చి చెప్పారు. 

click me!