చీకటి గదిలో బంధించి చిత్ర హింసలు.. కొడుకు, కోడలుపై వృద్ద దంపతుల న్యాయపోరాటం

Published : Jun 28, 2022, 05:04 PM IST
చీకటి గదిలో బంధించి చిత్ర హింసలు.. కొడుకు, కోడలుపై వృద్ద దంపతుల న్యాయపోరాటం

సారాంశం

కొడుకు, కోడలుపై వృద్ద దంపతుల న్యాయపోరాటానికి దిగారు. తమను చీకటి గదిలో బంధించి చిత్ర హింసలకు గురిచేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని ఎల్‌బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 

కొడుకు, కోడలుపై వృద్ద దంపతుల న్యాయపోరాటానికి దిగారు. తమను చీకటి గదిలో బంధించి చిత్ర హింసలకు గురిచేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని ఎల్‌బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. ఎల్‌బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న వృద్ద దంపతులు.. కొడుకు, కోడలు తమను ఇంటి నుంచి వేధిస్తున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. చీక‌టి గ‌దిలో బంధించి చిత్ర‌హింస‌ల‌కు గురి చేశార‌ని వారు క‌లెక్ట‌ర్ ఎదుట ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

వృద్ధ దంప‌తుల ఫిర్యాదుపై క‌లెక్ట‌ర్ వెంటనే స్పందించారు. ఆ ఇంటిని ఖాళీ చేయించి, వృద్ధుల‌కు అప్ప‌జెప్పాల‌ని రాచ‌కొండ సీపీ, ఆర్డీవోకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వృద్ధుల‌ను తీసుకొని రెవెన్యూ, పోలీసు అధికారులు ఆ ఇంటికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఆ వృద దంపతుల కొడుకు, కోడ‌లు ఇంటికి తాళం వేసి పారిపోయారు. దీంతో వృద్ధ దంప‌తులిద్ద‌రూ ఇంటి ముందే బైఠాయించి ఆందోళనకు దిగారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!