తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఫలితాల విడుదల: ఫీజు చెల్లించినవారంతా పాస్

Published : Jun 28, 2021, 04:08 PM ISTUpdated : Jun 28, 2021, 04:20 PM IST
తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఫలితాల విడుదల: ఫీజు చెల్లించినవారంతా పాస్

సారాంశం

తెలంగాణ ఇంటర్ సెకండియర్ పరీక్ష ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం నాడు విడుదల చేశారు.   

హైదరాబాద్:  తెలంగాణ ఇంటర్ సెకండియర్ పరీక్ష ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం నాడు విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్ మార్కుల ఆధారంగా సెకండియర్ మార్కులు కేటాయించారు.ఇవాళ సాయంత్రం ఐదు గంటల నుండి ఆన్‌లైన్ లో ఫలితాలు అందుబాటులో ఉంటాయని తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది.   

 

ఇంటర్ సెకండియర్ లో పరీక్ష ఫీజు చెల్లించిన 4,55,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు1,76,719 మంది విద్యార్థులకు ఎ గ్రేడ్, 1,04, 886 మంది విద్యార్థులకు బి గ్రేడ్  కేటాయించారు.61,887 మంది విద్యార్థులకు సి గ్రేడ్, 1,08,093 మంది విద్యార్థులకు డి గ్రేడ్ కేటాయించారు.

also read:నేడు తెలంగాణ ఇంటర్ సెకండియర్ పరీక్ష ఫలితాలు: మార్కుల కేటాయింపు ఇలా
విద్యార్థులకు ఫస్టియర్ లో వచ్చిన మార్కులను సెకండియర్ లో ఇవ్వనున్నారు. పరీక్షా ఫీజు చెల్లించిన ప్రతి ఒక్క విద్యార్థి ఉత్తీర్ణులు కానున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే జీవో జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 4 లక్షల 73 వేల 967 మంది ఇంటర్ సెకండియర్ విద్యార్థులుండగా వారిలో లక్షా 99 వేల 19 మంది విద్యార్థులు ఫస్టియర్ లో ఫెయిలయ్యారు.  ఫెయిలైన సబ్జెక్టుల్లో కూడ ఆ విద్యార్థులకు పాస్ మార్కులు అందించనున్నారు.  ప్రాక్టికల్స్ లో 100 శాతం మార్కులు కేటాయించారు.ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు మార్కులు ఎలా కేటాయించాలనే దానిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది.ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా  ప్రభుత్వం  మార్కులను కేటాయించింది.

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు