
ఆన్లైన్లో అశ్లీలం తో ఎరవేసి బెదిరిస్తూ అందినకాడికి వసూలుచేసే ఎక్స్‌టార్షన్ గ్యాంగ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. రాజస్థాన్ లోని మేవాట్ రీజియన్‌కు చెందిన 11 మంది నిందితులను ఇటీవల అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. విచారణ నేపథ్యంలో ఈ ముఠాపై హైదరాబాద్ లో పది కేసులు నమోదైనట్టు వెలుగులోకి వచ్చింది.
దీనిపై సమాచారం అందుకున్న సిటీ సైబర్ క్రైమ్ వారిపై న్యాయస్థానం నుంచి న్యాయస్థానం నుంచి ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్లు తీసుకున్నారు. ఈ వారెంట్ల ఆధారంగా వారిని ఇక్కడికి తీసుకు వస్తున్నారు. రాజస్థాన్ లోని మేవాట్ రీజియన్‌లో ఉండే ఆల్వార్, భరత్పూర్, మథుర ప్రాంతాలకు చెందిన 11 మంది ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీరు అల్వార్, భరత్ పూర్ లో షెల్టర్లు ఏర్పాటు చేసుకున్నారు.
నకిలీ వివరాలు, ఇంటర్నెట్ నుంచి సేకరించిన ఆకర్షణీయమైన మహిళల ఫోటోలతో ఫేస్బుక్ లో ప్రొఫైల్ క్రియేట్ చేశారు. ఈ ప్రొఫైల్ ద్వారా ఫేస్బుక్ లో ఉన్న అనేకమందికి ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పంపిస్తున్నారు. వీటిని యాక్సెప్ట్ చేసి ఫ్రెండ్స్ గా మారిన వాళ్లతో సైబర్ నేరగాళ్లు కొన్నాళ్లపాటు సదరు యువతి మాదిరిగానే మెసెంజర్ లో చాటింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత వాట్సాప్ నెంబర్స్ ఇచ్చేలా చేస్తున్నారు.
ఇంటర్నెట్ నుంచి దొంగిలించిన అర్థనగ్న, నగ్న వీడియోలను సైబర్ నేరగాళ్లు ప్రత్యేక యాప్ ద్వారా తమ ఫోన్లో నుంచి టార్గెట్ చేసిన వ్యక్తులకు ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడుతూ తామే నగ్నంగా తయారవుతున్న అంటూ ఆ యాప్లోని వీడియోలు ప్లే చేస్తున్నారు. దీంతో పూర్తిగా తమ వలలో పడిపోతున్న బాధితులను సైబర్ నేరగాళ్లు అనేకరకాలైన మాయ మాటలు చెబుతూ తాము చెప్పినట్లు చేసేలా చేస్తున్నారు.
ఒకరి భర్తతో.. మరొకరి భార్య పరార్..! పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన ఆ ఇద్దరు...!!...
ఇలా సేకరించిన వ్యక్తిగత వీడియోలను యూ ట్యూబ్ ఛానల్స్ లో పెడుతున్నారు. ఆ లింకులను బాధితులకు వాట్స్ అప్ చేసి తాము కోరిన మొత్తం చెల్లిస్తేనే వీటిని తొలగిస్తామని, లేదంటే ఇతర సోషల్ మీడియాలో పెట్టేస్తామంటూ నేరగాళ్లు బెదిరిస్తున్నారు. ఇలా అందినకాడికి పేటీఎం, గూగుల్ పే, బ్యాంకు ఖాతాల ద్వారా డబ్బు డిపాజిట్ చేయించుకుంటున్నారు.
ఆ పై పోలీసుల మాదిరిగా బాధితులకు కాల్ చేస్తూ మరో అంకానికి తెర లేపుతున్నారు. ఇలా రాజస్థాన్లోని అల్వార్ ప్రాంతానికి చెందిన వారిని ఈ గ్యాంగ్ వేధించింది. వారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మొత్తం 11 మందిని పట్టుకున్నారు. హైదరాబాద్ కు చెందిన పది మంది నుంచి రూ. 89 లక్షలు వసూలు చేసినట్లు తేలింది. ఈ మేరకు కూడా కేసులు ఉండడంతో ఒకటి రెండు రోజుల్లో సిటీకి తీసుకురానున్నారు.