కోర్ట్ తీర్పునకు అనుగుణంగా టీచర్ల బదిలీలు.. నేతల మాటల నమ్మొద్దు : సబితా ఇంద్రారెడ్డి

By Siva KodatiFirst Published Aug 31, 2023, 6:16 PM IST
Highlights

కోర్ట్ తీర్పునకు అనుగుణంగానే టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ నిర్వహిస్తామన్నారు తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.  త్వరలోనే టీచర్ల పదోన్నతులు, బదిలీలు , కొత్త నియామకాలు పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు.

కోర్ట్ తీర్పునకు అనుగుణంగానే టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ నిర్వహిస్తామన్నారు తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రాజకీయ నేతలు చేసే విమర్శలు పట్టించుకోవద్దని ఆమె హితవు పలికారు. ప్రస్తుతం అభ్యర్ధులు డీఎస్సీకి ప్రిపేర్ కావాలని.. ఆ తర్వాత ఖాళీలు వుంటే మళ్లీ ఉపాధ్యాయ భర్తీకి నోటిఫికేషన్ వెలువరిస్తామని సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. త్వరలోనే టీచర్ల పదోన్నతులు, బదిలీలు , కొత్త నియామకాలు పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు.

Also Read: టీచర్ల బదిలీలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్:కసరత్తు చేస్తున్న విద్యా శాఖ

ఇదిలావుండగా.. సెప్టెంబర్ 2 నుంచి తెలంగాణ ప్రభుత్వం టీచర్ల బదిలీ ప్రక్రియ చేపట్టనుంది. ఈ మేరకు శుక్రవారం షెడ్యూల్ విడుదల చేయనుంది. ఈ బదిలీల్లో ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్లు కేటాయించనుంది. నిజానికి టీచర్ల బదిలీలకు విద్యాశాఖ జనవరిలోనే షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరిలో బదిలీలు చేపట్టాల్సి వుండగా.. హైకోర్టు స్టే విధించడంతో ప్రక్రియ నిలిచిపోయింది. అప్పట్లో టీచర్ల బదిలీల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 59 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. 

click me!