వీవోఏల గౌరవం వేతం పెంపు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..

Published : Aug 31, 2023, 05:31 PM IST
వీవోఏల గౌరవం వేతం పెంపు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..

సారాంశం

ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ)లో విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్‌ (వీవోఏ)లుగా పనిచేస్తున్నవారి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వీవోఏ గౌరవ వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ)లో విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్‌ (వీవోఏ)లుగా పనిచేస్తున్నవారి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వీవోఏ గౌరవ వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వీవోఏలకు రూ. 3,900 గౌరవ వేతనం ఇస్తుండగా.. దానిని రూ. 5 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అదనపు సాయం రూ. 3 వేలు కలిపి వీవోఏలు నెలకు రూ. 8 వేలు అందుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 17 వేలకు పైగా వీవోఏలకు లబ్ది చేకూరనుంది. 

ఇక, గత కొంతకాలంగా తమ గౌరవ వేతనం పెంచాలని, సెర్ప్ ఉద్యోగులుగా  గుర్తించి రూ. 26 వేలు చెల్లించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని వీవోఏలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. 20 ఏళ్లు వీవోఏలుగా పనిచేస్తున్న రూ. 3,900  ఇస్తూ.. 20 రకాల పనులు చేయిస్తున్నారని, శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని వీవోఏలు ఆరోపిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Fog Alert : అధికపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో ఫాగ్ సైక్లోన్ కొనసాగుతోందా..? ఈ 12 జిల్లాలకు హైఅలర్ట్
Jabardasth Anchor Rashmi Gowtham Pressmeet: మీ సంస్కృతి అంతా మా బట్టలపైనే ఉంది| Asianet News Telugu