హైద్రాబాద్ నగరంలోని డీఏవీ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ స్కూల్లో చిన్నారిపై లైంగిక దాడి ఘటనపై విద్యాశాఖ అధికారులు విచారణ చేస్తున్నారు
హైదరాబాద్: నగరంలోని డీఏవీ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు .డీఏవీ స్కూల్ ఘటనపై విచారణ నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. బంజారాహిల్స్ లోని డీఏవీ స్కూల్ లో నాలుగేళ్ల చిన్నారిపై ప్రిన్సిపాల్ డ్రైవర్ రజనీకుమార్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి విద్యార్ధి పేరేంట్స్ స్కూల్ కు వచ్చి రజనీకుమార్ పై దాడికి పాల్పడ్డారు. విద్యార్థిని పేరేంట్స్ పిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు రజనీకుమార్ పై కేసు నమోదు చేశారు. స్కూల్ ప్రిన్సిపాల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పేరేంట్స్ ఆందోళనలతో ప్రిన్సిపాల్ ను విధుల నుండి యాజమాన్యం తప్పించింది.
ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ గా పనిచేసిన రజనీకుమార్ డిజిటల్ క్లాసులను బోధించే పేరుతో చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ గా ఉన్న రజనీకుమార్ డిజిటల్ క్లాసు రూములకు ఎందుకు వెళ్లేవాడనే విషయమై విద్యాశాఖ అధికారులు ఆరా తీశారు. ఈ స్కూల్ లో ఏం జరిగిందనే విషయమై విద్యా శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. స్కూల్ లో పనిచేసే టీచర్లను విద్యాశాఖ అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.
undefined
ఈ ఒక్క చిన్నారిపైనే కాకుండా మరికొందరు చిన్నారులపై కూడ నిందితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ స్కూల్ లో సీసీటీవీ పుటేజీనీ పోలీసులు సీజ్ చేశారు. డిజిటల్ రూమ్ లో సీసీటీవీలు లేవని పోలీసులు గుర్తించారు. డిజిటల్ రూమ్ కి చిన్నారిని తీసుకెళ్లి తలుపులు వేసి లాక్ చేసి లైంగిక దాడికి పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు.బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించారు.
భరోసా కేంద్రం నుండి వైద్య పరీక్షలకు తరలించారు.డిజిటల్ రూమ్ కు తరచుగా వెళ్లే ఇతర నిందితులను కూడ పోలీసులు విచారించనున్నారు.చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడితో పాటు స్కూల్ పై చర్యలు తీసుకోవాలని పేరేంట్స్, విద్యార్ధి సంఘాలు రెండు రోజుల క్రితం ఆందోళనకు దిగిన విషయం తెలిసిందేఈ ఘటనకు సంబంధించి డీఏవీ స్కూల్ పేరేంట్స్ టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. బాధితులకు న్యాయం జరిగేలా తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.