చెత్త తీస్తుండగా బయటపడ్డ 3 తుపాకులు.. తెలంగాణ శాసనమండలిలో కలకలం

Siva Kodati |  
Published : Oct 21, 2022, 02:25 PM IST
చెత్త తీస్తుండగా బయటపడ్డ 3 తుపాకులు.. తెలంగాణ శాసనమండలిలో కలకలం

సారాంశం

హైదరాబాద్‌లో తెలంగాణ శాసనసభ సమీపంలో శుక్రవారం కలకలం రేగింది . జూబ్లీహాల్‌ ఆవరణలో చెత్తను తొలగిస్తుండగా 3 తుపాకులు బయటపడ్డాయి. ఆ తుపాకులు ఎవరివి..? కట్టుదిట్టమైన భద్రత వుండే అసెంబ్లీ ప్రాంగణంలోకి ఎలా వచ్చాయన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

హైదరాబాద్‌లో తెలంగాణ శాసనసభ సమీపంలో శుక్రవారం కలకలం రేగింది. జూబ్లీహాల్‌లోని శాసనమండలి సమీపంలో రివాల్వర్లు వెలుగుచూశాయి. జూబ్లీహాల్‌ ఆవరణలో చెత్తను తొలగిస్తుండగా 3 తుపాకులు బయటపడ్డాయి. చెట్ల పొదల్లో 1 తపంచా, రెండు నాటు తుపాకులు కనిపించాయి. దీనిపై అసెంబ్లీ సిబ్బంది సైఫాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు 3 రివాల్వర్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ తుపాకులు ఎవరివి..? కట్టుదిట్టమైన భద్రత వుండే అసెంబ్లీ ప్రాంగణంలోకి ఎలా వచ్చాయన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?