టెన్త్ క్లాస్ పేపర్ లీక్ పేరుతో విద్యార్ధులను గందరగోళపర్చే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు.
హైదరాబాద్: తమ రాజకీయ అవసరాల కోసం విద్యార్ధుల జీవితాలను ఫణంగా పెట్టవద్దని తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజకీయ పార్టీలను కోరారు. బుధవారంనాడు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. పిల్లల భవిష్యత్తుపై బాధ్యత ఉన్న ఏ పార్టీ నేతలు కూడా ఇలా వ్యవహరించబోరని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. తమ ప్రభుత్వంపై పోరాటం చేయాలనుకుంటే వేరే అంశాలున్నాయన్నారు.
టెన్త్ క్లాస్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు. టెన్త్ క్లాస్ పేపర్ ను ఎవరూ లీక్ చేసినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. టెన్త్ క్లాస్ ప్రశ్నాపత్రాలను వాట్సాప్ లో షేర్ చేసి గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. పరీక్షలు ప్రారంభమయ్యాక పేపర్లను వాట్సాప్ లో షేర్ చేస్తే విద్యార్దులకు ఏం లాభమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. టెన్త్ క్లాస్ విద్యార్ధుల పేరేంట్స్ ను గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు.
టెన్త్ క్లాస్ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం ఎక్కడుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లీక్ అయిందని వైరల్ చేసిన ప్రశాంత్ రెండు గంటల్లో 144 ఫోన్ కాల్స్ చేసిన విషయాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి గుర్తు చేశారు.
తాను కూడా పేపర్లు భద్రపర్చిన కేంద్రంలోకి వెళ్తే సెల్ ఫోన్ ను తీసుకెళ్లబోనని చెప్పారు. తాండూరు ఘటనతో పాటు వరంగల్ ఘటనలు ఉద్దేశ్యపూర్వకంగా జరిగినవని ఆమె అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో టెన్త్ క్లాస్ పరీక్షలు రాస్తున్న 5 లక్షల మంది విద్యార్ధులను ఆందోళనలకు గురి చేస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభిప్రాయడ్డారు.
టెన్త్ క్లాస్ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం ఎక్కడుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లీక్ అయిందని వైరల్ చేసిన ప్రశాంత్ రెండు గంటల్లో 144 ఫోన్ కాల్స్ చేసిన విషయాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి గుర్తు చేశారు.
also read:బండి సంజయ్ ఆరెస్ట్: జేపీ నడ్డా ఆరా , మాజీ ఎమ్మెల్సీకి ఫోన్
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను నిన్న రాత్రి కరీంనగర్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లీక్ విషయమై పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ పేపర్ లీక్ విషయమై ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడి నుండి బండి సంజయ్ కు వాట్సాప్ లో షేర్ అయిందని పోలీసులు చెప్పారు.ఈ విషయమై పోలీసులు కరీంనగర్ నుండి బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. బండి సంజయ్ అరెస్ట్ విషయం తెలుసుకున్న ఆ పార్టీ శ్రేణులు ఇవాళ ఉదయం బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా చేరుకున్నారు. పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు ప్రయత్నించారు.