10 రోజుల్లో పనులను పూర్తి చేయాలి: సచివాలయ పనులపై మంత్రి ప్రశాంత్ రెడ్డి సమీక్ష

By narsimha lode  |  First Published Jan 16, 2023, 10:01 PM IST


తెలంగాణ సచివాలయంలో అసంపూర్తిగా  ఉన్న  పనులను 10 రోజుల్లో పూర్తి చేయాలని  మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. వచ్చే నెల  17వ తేదీన కొత్త సచివాలయం  ప్రారంభించాలని సీఎం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.  
 


హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో  అసంపూర్తిగా  ఉన్న పనులను  10 రోజుల్లో పూర్తి చేయాలని  మంత్రి  వేముల ప్రశాంత్ రెడ్డి  ఆదేశించారు.తెలంగాణ సచివాలయ నిర్మాణ పనులను  మంత్రి ప్రశాంత్  రెడ్డి  సోమవారం నాడు  అధికారులతో సమీక్షించారు. వచ్చే నెల  17వ తేదీన  తెలంగాణ కొత్త సచివాలయాన్ని  ప్రారంభించాలని  నిర్ణయం తీసుకున్నారు.  అయితే తెలంగాణ సచివాలయ నిర్మాణానికి సంబంధించి  ఇంకా కొన్ని  పనులు  పూర్తి కావాల్సి ఉంది.  అసంపూర్తిగా  ఉన్న  పనులను 10 రోజుల్లో   పూర్తి చేయాలని  మంత్రి ఆదేశించారు.  10 రోజుల కంటే  ఒక్కువ సమయం తీసుకోవద్దని కూడా  అధికారులకు  మంత్రి సూచించారు. 

తెలంగాణ సచివాలయాన్ని  కూల్చివేసి  అన్ని హంగులతో కొత్త  సచివాలయాన్నినిర్మింాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.  దీంతో  2019 జూన్  27న  కొత్త సచివాలయ నిర్మాణ పనులకు  కేసీఆర్ శంకుస్థాపన చేశారు.  సుమారు  ఏడు లక్షల చదరపు  అడుగుల స్థలంలో  కొత్త స్థలంలో  సచివాలయాన్ని నిర్మాణం చేపట్టారు. తొమ్మిది మాసాల్లోనే ఈ సచివాలయం పనుల నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావించారు.  కానీ కరోనా కారణంగా  సచివాలయ నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి. 2022 అక్టోబర్ మాసంలో  సచివాలయం ప్రారంభించాలని  భావించారు. అయితే  అక్టోబర్ మాసం నాటికి సచివాలయ నిర్మాణ పనులు పూర్తి కాలేదు.  దీంతో అక్టోబర్ మాసంలో  సచివాలయం  ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు.  ప్రస్తుతం  సంక్రాంతి వరకు మంచి రోజులు లేవు. సంక్రాంతి తర్వాత  సచివాలయాన్ని ప్రారంభించాలని భావించారు. ఫిబ్రవరిలో  కేసీఆర్ పుట్టిన రోజు ఉంది.  దీంతో  ఫిబ్రవరి  17న కొత్త సచివాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. 

Latest Videos

also read:తెలంగాణ సచివాలయం ప్రారంభానికి ముహుర్తం ఖరారు:కేసీఆర్ పుట్టిన రోజున కొత్త సెక్రటేరియట్ ప్రారంభం

కొత్త సచివాలయంలో  మంత్రుల కార్యాలయాలతో పాటు  ఆయా శాఖలకు చెందిన అధికారుల కార్యాలయాలు కూడా పక్కనే ఉంటాయి.  అంతేకాదు  సమావేశాలు నిర్వహించుకొనేందుకు  వీలుగా  సమావేశ మందిరాలను  కూడ నిర్మించారు. మరో వైపు  మంత్రులు, విజిటర్స్ , అధికారుల వాహనాల పార్కింగ్  కోసం  ప్రత్యేకంగా  ఏర్పాటు్లు చేశారు.సచివాలయాన్ని ఏడు ఫ్లోర్లలో నిర్మించారు. ఏడో అంతస్థులో  సీఎం కేసీఆర్ కార్యాలయం ఉంటుంది.  
 

click me!