సంగారెడ్డిలో అత్యాచార బాధితురాలి కుటుంబం నుండి లంచం డిమాండ్: అధికారి సస్పెన్షన్

By narsimha lodeFirst Published Jan 16, 2023, 9:29 PM IST
Highlights

సంగారెడ్డి జిల్లాలోని అత్యాచార బాధితురాలి  కుటుంబానికి  పరిహరం చెల్లింపులో  లంచం డిమాండ్  చేసిన  అధికారి సత్యనారాయణను జిల్లా కలెక్టర్  శరత్ సస్పెండ్  చేశారు.

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో  రూ. 50 వేలు లంచం అడిగిన  అధికారిని  కలెక్టర్ శరత్  సస్పెండ్  చేశారు. జిల్లాలో అత్యాచార బాధితురాలి  కుటుంబానికి  రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల సహాయాన్ని ప్రకటించింది.  ఈ మేరకు  ప్రభుత్వం  చెక్ ను  కూడా  సిద్దం చేసింది. ఈ చెక్ ను  ఇచ్చేందుకు  కలెక్టరేట్ లో పనిచేసే అధికారి  సత్యనారాయణ  బాధితురాలి కుటుంబాన్ని  రూ. 50 వేలు లంచం అడిగాడు.  ఈ డబ్బులు  ఇవ్వకపోవడంతో  రూ.  5 లక్షల చెక్  ఇవ్వకుండా  తిప్పించుకున్నాడు.  ఐదు మాసాలుగా  అధికారి చుట్టూ తిరిగి విసిగిన బాధిత కుటుంబం   కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా  అధికారి సత్యనారాయణను  సస్పెండ్  చేశారు కలెక్టర్ శరత్,. మరో వైపు  బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల చెక్ ను వెంటనే అందించాలని కలెక్టర్ శరత్ ఆదేశించారు.

అత్యాచార బాధితురాలిని ఆదుకోనేందుకు   అందిస్తున్న సహయంలో  కూడా లంచం ఆశించిన  అధికారి తీరుపై  మహిళా సంఘాలు  తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇలాంటి అధికారులు భవిష్యత్తులో మళ్లీ మళ్లీ ఈ తరహ చర్యలకు పాల్పడకుండా  చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.  ఃఅత్యాచార ఘటనతో  మానసికంగా  తీవ్ర వేదనలో  ఉన్న కుటుంబానికి  ఆర్ధిక సహాయం అందించకుండా  ఐదు మాసాలు తిప్పిన  అధికారి తీరును  ప్రజా సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి.    
 

 

click me!