ఈ నెల 14న న్యూఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం:ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి

By narsimha lode  |  First Published Dec 11, 2022, 2:57 PM IST

న్యూఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఈ నెల 14న ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. సర్ధార్ పటేల్ రోడ్డులో తాత్కాలిక  భవన నిర్మాణ పనులను  మంత్రి ప్రశాంత్ రెడ్డి , ఎంపీ సంతోష్ కుమార్ లు ఇవాళ పరిశీలించారు.
 



హైదరాబాద్: ఈ నెల 14వ తేదీన  న్యూఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభించాలని కేసీఆర్ తలపెట్టారు.   ఈ కార్యాలయ ప్రారంభోత్సవానికి రావాలని పార్టీ నేతలకు కేసీఆర్  ఆహ్వానం పలికారు. ఢిల్లీలోని వసంత్ విహార్ లో పార్టీ స్వంత  భవన నిర్మాణం పూర్తి కావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. అయితే  ఈ భవన నిర్మాణం పూర్తయ్యేవరకు  తాత్కాలికంగా ఓ భవనాన్ని  అద్దెకు తీసుకున్నారు. ఈ భవనంలో  కొన్ని మార్పులను కూడా కేసీఆర్ ఇదివరకే సూచించారు. 

సర్ధార్ పటేల్ రోడ్డులోని భవనంలో పనులను తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,  ఎంపీ సంతోష్ కుమార్ లు పరిశీలించారు.ఈ ఏడాది అక్టోబర్  12న వసంత్ విహార్ లో  పార్టీ స్వంత  భవన నిర్మాణ పనులను  కేసీఆర్ పరిశీలించారు. పార్టీ నిర్మాణంలో  అవసరమైన మార్పులు, చేర్పులకు కేసీఆర్ సూచనలు చేశారు.ఈ ఏడాది అక్టోబర్  11న  న్యూఢిల్లీలోని సర్ధార్ పటేల్ రోడ్డులో  అద్దెకు తీసుకున్న భవనాన్ని కూడా కేసీఆర్ పరిశీలించారుఈ భవనంలో  పలు మార్పులను కేసీఆర్ సూచించారు. సర్దార్ పటేల్ రోడ్డులో  తాత్కాలికంగా ఏర్పాటు చేసిన భవనాన్ని ఈ  నెల 14న ప్రారంభించనున్నారు. ఢిల్లీ వేదికగా  పార్టీ కార్యక్రమాలను ప్రారంభించాలని  కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో  ఈ కార్యాలయాన్ని ప్రారంభించాలని కేసీఆర్  తలపెట్టారు. ఈ నెల 14వ తేదీన  మంచి ముహుర్తం ఉంది. దీంతో అదే రోజున తాత్కాలిక భవనాన్ని ప్రారంభించనున్నారు.

Latest Videos

టీఆర్ఎస్ పేరును  బీఆర్ఎస్ గా మారుస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.  ఈ  ఏడాది అక్టోబర్ ఐదో తేదీన  టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం చేసిన తీర్మానం కాపీ ఆధారంగా ఈసీ ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

click me!