లిక్కర్ కేసులో ఛాయ్, బిస్కట్ల కోసం సీబీఐ అధికారులు కవిత ఇంటికి రాలేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు.
నిర్మల్: ఛాయ్, బిస్కట్ల కోసం సీబీఐ అధికారులు కవిత ఇంటికి రాలేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు.ఆదివారం నాడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్రకు బయలుదేరే ముందు బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దొరికిపోయారన్నారు. కవిత ఏమైనా స్వాతంత్ర్య సమరయోధురాలా అని ఆయన ప్రశ్నించారు. కవిత ఇంటి చుట్టూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ఆయన సెటైర్లు వేశారు.పెద్ద పెద్ద హోర్డింగులు కవిత నివాసం వద్ద ఎందుకు ఏర్పాటు చేశారో చెప్పాలని ఆయన బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. ఈ ఫ్లెక్సీలను చూసీ సీబీఐ అధికారులు భయపడతారా అని ఆయన ప్రశ్నించారు.ఈ హోర్డింగ్ లను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని బండి సంజయ్ చెప్పారు.
also read:ఢిల్లీ లిక్కర్ స్కాం: కవిత ఇంటికి చేరుకున్న సీబీఐ అధికారులు
undefined
ప్రజల కోసం సాగిన ఉద్యమంలో కవితపై కేసు పెట్టారా అని బండి సంజయ్ అడిగారు. లిక్కర్ కేసులో కవితను సీబీఐ అధికారులు సమాచారం అడుగుతున్నారన్నారు. సీబీఐ విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. తప్పు ఎవరూ చేసినా శిక్షకు గురి కావాల్సిందేనన్నారు.ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నుండి సమాచారం సేకరించేందుకు సీబీఐ అధికారులు ఇవాళ వచ్చారు.ఈ విషయమై ఈ నెల 2వ తేదీన సీబీఐ అధికారులు కవితకు నోటీసులు పంపారు. 160 సీఆర్‌పీసీ సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల ఆధారంగా ఇవాళ విచారణకు సీబీఐ అధికారులు వచ్చారు.ఈ నెల 11,12, 14, 15 తేదీల్లో ఏదో ఒక రోజున రావాలని సీబీఐ అధికారులకు కవిత సమాచారం పంపారు. ఈ సమాచారం ఆధారంగా ఇవాళ విచారణకు వస్తామని ఈ నెల 6వ తేదీన సాయంత్రం సీబీఐ అధికారులు కవితకు సమాచారం పంపారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే ఆరుగురిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో సీబీఐ, ఈడీ అధికారులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలు దఫాలు సోదాలు నిర్వహించారు. లిక్కర్ స్కాంలో ఆప్, బీఆర్ఎస్ పై బీజేపీ తీవ్రమైన విమర్శలు చేసింది.