కృష్ణా నదిపై అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తామంటే పాతరేస్తామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: కృష్ణా నదిపై అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తామంటే పాతరేస్తామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య మాటల యుద్దం సాగుతోంది. తాజాగా ఈ విషయమై శుక్రవారం నాడు మంత్రి నిరంజన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కృష్ణా జలాలను అన్యాయంగా తీసుకొని పోతామనడం సరైంది కాదన్నారు మంత్రి. తమ హక్కుకు విరుద్దంగా కృష్ణా బేసిన్ దోసెడు నీళ్లు కూడ ఇవ్వమని ఆయన తేల్చి చెప్పారు.
తెలంగాణ ప్రయోజనాలపై నాడు కాంగ్రెస్ నేడు బీజేపీపై సైంధవ పాత్ర పోషిస్తున్నాయని ఆయన మండిపడ్డారు.తెలంగాణ ఉద్యమమే నదీ జలాలు, సాగునీటి హక్కుల కోసం సాగిందని ఆయన గుర్తు చేశారు.
also read:తెలంగాణ నేతల వాదన రాజకీయ అవసరమే: రాయలసీమ లిఫ్ట్‌పై ఏపీ మంత్రి పేర్ని నాని
కెసిఆర్ చేపట్టిన ప్రాజెక్టులతో ప్రయోజనమే లేదు.. విరుచుకుపడ్డ భట్టి..
ఒక్క ప్రాజెక్టు నిర్మాణంలో వచ్చే ఉత్పత్తి పాత్ర , నీటి సంపద ఎంత అని ఆయన ప్రశ్నించారు. మత్స్య సంపద, జీవ వైవిద్యం, పశు సంపద ఎంత అని ఆయన అడిగారు.మొత్తంగా వచ్చే సమాజ సంపద ఎంతో చెప్పాలన్నారు.
ఇవన్నీ పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.