తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం కృష్ణ, గోదావరి నీళ్ళను పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడుకోవాలనే మన ఉద్యమాలు మొదలయ్యాయ్యాని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విరుచుకుపడ్డారు.
తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం కృష్ణ, గోదావరి నీళ్ళను పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడుకోవాలనే మన ఉద్యమాలు మొదలయ్యాయ్యాని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విరుచుకుపడ్డారు.
కానీ దురదృష్టం ఈ రెండు నదులపై కేసీఆర్ ప్రభుత్వం మొదలు పెట్టిన ప్రాజెక్టుల వల్ల ఒక్క చుక్క నీరు కూడా వచ్చే పరిస్థితి లేదు. రెండు నదులపై కెసిఆర్ చేపట్టిన ప్రాజెక్టులతో ప్రయోజనమే లేదు అన్నారు.
undefined
కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం సంమేశ్వరం దగ్గర రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడుతుంటే తెలంగాణ ప్రభుత్వాన్ని తన్ని లేపేందుకు ప్రయత్నాలు చేశాయి. ఏపీ ప్రభుత్వం శ్రీశైలం దగ్గర డీప్ కట్ లో ప్రాజెక్టు కడుతున్నారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే రోజుకు 11టీఎంసీల నీళ్లు పోతాయని చెప్పాం.
ఆ ప్రాజెక్టు పూర్తయితే శ్రీశైలం నిండదు. శ్రీశైలం నిండకపోగా నాగార్జున సాగర్ కు నీళ్లు రావు. నాగార్జున సాగర్.. ఎండిపోతుంది అని కూడా చెప్పాం. శ్రీశైలం మీద ఆధారపడి గత ప్రభుత్వాలు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, కోయిల్ సాగర్, భీమా ప్రాజెక్టులు నష్టపోతాయి. దాంతో పాటు నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ మీద ఆధార పడ్డ సాగుభూములున్నీ ఎండిపోతాయి.
ఇది చాలా ప్రమాదకర పరిస్థితి అని కాంగ్రెస్ పార్టీ అరిచిగీపెట్టినా నిద్ర లేవలేదు. ఏడాది తరువాత ఇప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్, క్రుష్ణా బోర్డు, కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. పట్టించుకోని కేసీఆర్ ఇప్పుడు లేచి అరుస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలే అరిచిగీపెట్టి పోరాటం చేశాయి.
కేసీఆర్ కు సోయి లేకకాదు.. ఆయనకు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకంటే.. ఆయన ఆర్థిక ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం. ఈ కారణం వల్లే కేసీఆర్ తెలంగాణ నీటి ప్రయోజనాలకు ఫణంగా పెట్టారు.
పోతిరెడ్డిపాడును కాంగ్రెస్ మొదలు పెట్టింది.. కాంగ్రెస్ మంత్రులు ప్రోత్సహించారనడం అసత్య ప్రచారం. పోతిరెడ్డిపాడును ఆపాలంటూ కాంగ్రెస్ నాయకులే ఉద్యమాలు చేశారు. చివరకు ప్రత్యేక రాష్ట్రం వస్తే తప్ప తెలంగాణకు న్యాయం జరగదని కాంగ్రెస్ కు చెందిన 42 మంది ఎమ్మెల్యేలు అధిష్గానానికి లేఖ రాశారు.
తెలంగాణ కావాలని అడిగింది కూడా మా శాసనసభ్యులే.. అప్పటికి కేసీఆర్ పుట్టలేదు కూడా. మా ప్రభుత్వ మంత్రులే అప్పట్లో రాజీనామాలు చేశారు. పోతిరెడ్డి పాడు పాపం... కెసిఆర్ దే. 1985-86 ప్రాంతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం పోతిరెడ్డిపాడు మొదలు పెట్టినప్పుడు నువ్వేం చేశావు.
ఆనాడు కరువు మంత్రిగా ఉన్న కేసీఆర్.. పోతిరెడ్డిపాడుకు నాంది పలికాడు. దానికి ఆయనే బాధ్యుడు. మీ నాయకత్వంలోనే పోతిరెడ్డిపాడు మొదలైంది. దాదాపు 406 కిలోమీటర్లు ఓపెన్ కెనాల్ ద్వారా రోజుకు ఒక్క టీఎంసీ లెక్కన 15 టీఎంసీలు చెన్నై నగరానికి తాగునీళ్లు తీసుకునిపోయే పోతిరెడ్డిపాడును మొదలు పెట్టిందే మీరు.
ఓపెన్ కెనాల్ పెట్టడం వల్లే వాళ్లు రిజర్వాయర్లు పెట్టి నీళ్లు తోడుకోవడం, ఇంత అడ్డగోలుగా నీళ్లు తీసుకెళ్లడం జరిగేది కాదు. అప్పడు మంత్రిగా ఉన్న కే. చంద్రశేఖర్ రావు ఏచి చేశాడు.?? పాపం కేసీఆర్ చేసి.. రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పై నిందలా??
క్రిష్ణా నదిపై కేసీఆర్ మొదలు పెట్టిన ప్రాజెక్టులు పాలమూరు - రంగారెడ్డి, డిండి మాత్రమే. ఈ రెండు ప్రాజెక్టుల కోసం ఇప్పటివరకూ కొన్ని వేల కోట్లరూపాయలు ఖర్చు పెట్టారు. ఇప్పటివరకూ కనీసం ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా??
కొత్త ప్రాజెక్టులతో కేసీఆర్ నీళ్లు ఇవ్వకపోగా.. గత ప్రాజెక్టులు కట్టిన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ తో 3.4 లక్షల ఎకరాలు, ఎస్సెల్బీసీ ఎఎంఆర్ తో 3.7 లక్షల ఎకరాలు, నెట్టెంపాడుతో 2 లక్షల ఎకరాలు, మొత్తం 9 లక్షల 10 వేల ఎకరాలు. వీటితో పాటు నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ద్వారా 6 లక్షల 40 వేల ఎకరాలు15 లక్షల 50 వేల ఎకరాలకు కేసీఆర్ రాకముందే నీళ్లు ఇచ్చాయి.
రాయలసీమ లిప్ట్ సంగమేశ్వరం గురించి కేసీఆర్ పట్టించుకోకపోవడం వల్ల ఈ 15 లక్షల 50 వేల ఎకరాలు ఎండిపోతున్నాయి. కేసీఆర్ మొద్దు నిద్రలో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వాలు సాగులోకి తెచ్చిన 15 లక్షలా 50 వేల ఎకరాలు, ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పాలమూరు - రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల ఆయకట్టు 10 లక్షల ఎకరాలు కలుపుకుని మొత్తంగా 25 లక్షల ఎకరాలను ఎండబెడుతున్నాయి.
భావోద్వేగాలు రెచ్చ గొట్టి .. రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు కెసిఆర్ తప్పంతా కేసీఆర్ దే. రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం ఏడాది పాడు ఆగి ఇప్పుడు. .. మళ్లీ కొత్త డ్రామాకు తెరలేపుతున్నావు కేసీఆర్.
కేసీఆర్ కు చిత్తశుద్ది రాయలసీమ సంగమేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం జీ.ఓ ఇచ్చిన రోజే ఆపేవాడు. ఏడాది వరకూ ఎందకు మాట్లాడలేదు.
రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టవద్దు.