పాలమ్మినా.. కాలేజీలు పెట్టినా అని .. ‘‘పోలీస్ ’’ స్పెల్లింగ్ రాదా : అడ్డంగా బుక్కైన మల్లారెడ్డి

By Siva KodatiFirst Published Jun 6, 2023, 3:46 PM IST
Highlights

పోలీస్ స్పెల్లింగ్ చెప్పాలంటూ ఏకంగా పోలీసులనే అడిగి అడ్డంగా బుక్కయ్యారు మంత్రి మల్లారెడ్డి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 

తన మాటలు , చేష్టలతో అందరినీ నవ్విస్తూ వుంటారు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి. ఆయనను ఎవరు కదిపినా, లేదా ఏదైనా వేదికలెక్కినా వెంటనే వచ్చే డైలాగ్.. ‘‘కష్టపడ్డా, పాలు , పూలు అమ్మినా, కాలేజీల్ పెట్టినా’’ అంటారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ డైలాగ్స్ పాపులర్. ఇదే ఆయనను మాస్ జనాలకు బాగా దగ్గర చేసింది. ఇక అసెంబ్లీలో మల్లన్న మైక్ అందుకున్నారంటే ఎవరైనా నవ్వు ఆపుకోవడం కష్టమే. 

ఇదిలావుండగా.. ఇటీవలికాలంలో ఏపీ రాజకీయాలను ఆయన ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. అక్కడ కాపు, కమ్మ, రెడ్డి అనే లీడర్లు తప్పించి జనాలను పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ఏపీనీ బాగుచేయబోయేది కేసీఆరేనని.. పోలవరం నిర్మాణం, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడటం ఆయన వల్లే అవుతుందన్నారు. త్వరలోనే విశాఖలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయ్యాయి. 

ALso Read: ఏపీలో కుల రాజకీయాలు తప్ప ఏమి లేదు.. మంత్రి మల్లారెడ్డి సంచలన కామెంట్స్

తాజాగా ఆయన ఏదో మాట్లాడబోయి అడ్డంగా బుక్కయ్యారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం మేడ్చల్ పోలీస్ స్టేషన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా రిజిస్టర్‌లో రాస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పెన్ను, రిజిస్టర్ అందుకున్న మల్లారెడ్డి ఏం రాయాలని అధికారులను, సిబ్బందిని రాయాలని అడగ్గా .. దానికి వారు పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ అని రాసి డేట్ వేయమన్నారు. ఆ వెంటనే ఆయన ‘‘పోలీస్ ’’ స్పెల్లింగ్ ఏంటి అని అడిగే సరికి అక్కడున్న వారంతా ఖంగుతిన్నారు. 

అయితే మంత్రిగారు తమను పరీక్షించడానికి అలా అంటున్నారని భావించారు. అయినప్పటికీ స్పెల్లింగ్ చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్నో మెడికల్, మేనేజ్‌మెంట్ , ఇంజనీరింగ్ స్కూళ్లను నడుపుతూ.. బాధ్యత గల పదవిలో వుంటూ మల్లారెడ్డికి ‘పోలీస్’ అన్న పదానికి స్పెల్లింగ్ రాకపోవడం ఏంటని నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. 
 

click me!