తెలంగాణ యూనివర్శిటీలో ఏసీబీ, విజిలెన్స్ సోదాలు

Published : Jun 06, 2023, 03:43 PM IST
తెలంగాణ  యూనివర్శిటీలో  ఏసీబీ, విజిలెన్స్ సోదాలు

సారాంశం

తెలంగాణ  యూనివర్శిటీలో  ఇవాళ ఏసీబీ, విజిలెన్స్  అధికారులు సోదాలు నిర్వహించారు.  

నిజామాబాద్: తెలంగాణ  యూనివర్శిటీలో  ఏసీబీ,  విజిలెన్స్  అధికారులు  మంగళవారంనాడు సంయుక్తంగా తనిఖీలు  చేశారు..  గత కొంతకాలంగా   తెలంగాణ యూనివర్శిటీ  వీసీ, పాలకవర్గం  మధ్య  పొసగడం లేదు.  దీంతో  వీసీపై  ఏసీబీ  విచారణ  చేయించాలని కోరుతూ  పాలకవర్గం  ప్రభుత్వానికి  లేఖ పంపింది. దీంతో  ఇవాళ  ఏసీబీ, విజిలెన్స్ అధికారులు  సంయుక్తంగా  నిర్వహిస్తున్నారు.

 ఈ తనికీలు  నిర్వహించే  సమయంలో  వీసీ , రిజిస్ట్రార్ లు   తమ  క్యాంప్  కార్యాలయాలకు  వెళ్లారు.తెలంగాణ  యూనివర్శిటీ  అడ్మినిస్ట్రేషన్  భవనంలోని అకౌంటెంట్ , ఎవో సెక్షన్ , ఎస్టాబ్లిస్ మెంట్ సెక్షన్లలో  సోదాలు  నిర్వహించారు. తెలంగాణ  యూనివర్శిటీ  వీసీ  రవీందర్ గుప్తాపై చర్యలు తీసుకోవాలని   పాలకమండలి తీర్మానం  చేసిన విషయం తెలిసిందే. 

తెలంగాణ  యూనివర్శిటీలో  ఉద్యోగాల నియామాకాలు,   కొనుగోళ్లలో  అవకతవకలు  చోటు  చేసుకున్నాయని  ఆరోపణలు  వచ్చాయి.  ఈ విషయమై  ఏసీబీ  విచారణకు   పాలకమండలి  సమావేశం తీర్మానం  చేసింది.  ఈ సమావేశానికి  వీసీ  రవీందర్ గుప్తా  హాజరు కాలేదు

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ