కాంగ్రెస్ నేతలు అహంకారాన్ని వదులుకోలేదు: కేటీఆర్

First Published Jul 10, 2018, 6:51 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ నేతలు తమ అహంకారాన్ని వదులుకోలేదని  తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం నుండి వివిధ పార్టీల నుండి మంగళవారం నాడు హైద్రాబాద్ లో పలువురు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.


హైదరాబాద్:  కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో నల్గొండ జిల్లాలో ఇంటింటికి ఫ్లోరోసిస్ వ్యాధిని వ్యాప్తి చెందేలా చేసిందని తెలంగాణ ఐటీ  శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు.

మంగళవారం నాడు తెలంగాణ భవన్ లో  నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన నేతలు టీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ ఉద్యమంలో  క్షేత్రస్థాయిలో నల్గొండ ప్రజలు అండగా నిలిచారని చెప్పారు.కానీ, కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న నల్గొండ జిల్లాకు చెందిన నేతలు మాత్రం తమ అహంకారాన్ని ఇంకా వదులుకోలేదని  కేటీఆర్ విమర్శలు గుప్పించారు.కాంగ్రెస్ పార్టీ నేతల ఆస్తులు పెరిగాయని ఆయన ఆరోపణలు చేశారు. 

కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో చేసిన కార్యక్రమాల వల్ల నల్గొండ జిల్లాలో ఫోరోసిస్ ఒంటింటికి వ్యాప్తి చెందిందని చెప్పారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నాలుగేళ్ల ముందు నల్గొండ జిల్లాలో ఉన్న అభివృద్ధి ప్రస్తుతం అభివృద్ధి విషయాన్ని బేరీజు వేసుకోవాలని ఆయన కోరారు. 

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని ఆయన చెప్పారు. నల్గొండ జిల్లా చిట్యాలలోనే డ్రైపోర్ట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. పవర్‌లూమ్, హ్యాండ్లూమ్  పరిశ్రమలను ఆదుకోనున్నట్టు కేటీఆర్ ప్రకటించారు. 

click me!